Ads
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆసియాలోనే అత్యంత గొప్పగా జరిగే గిరిజన జాతర ఇది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం దగ్గర జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి.
Video Advertisement
ఈ క్రమంలోసమ్మక్క, సారలమ్మ ప్రధాన పూజారి అయిన సిద్ధబోయిన అరుణ్ హలాల్ విషయంలో కీలకమైన కామెంట్స్ చేశారు. మేడారం జాతరలో హలాల్ నిషిద్ధం అంటూ ఆయన రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మాఘ శుద్ధ పున్నమి నాడు సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువుదీరే సమయం కొన్ని గంటలలో అసన్నమవుతోంది. ప్రస్తుతం అన్ని మార్గాలు మేడారం వైపుకే దారి తీస్తున్నాయి. మేడారం వనం అంతా భక్తులతో నిండిపోతోంది. రేపటి నుండి మేడారం జాతర మొదలు కానుంది. ఇప్పటికే మేడారం జనంతో నిండిపోయింది. భక్త కోటి మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న మాఘశుద్ధ శుభ ఘడియలు వచ్చేశాయి.
ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు, సంస్కృతికి అద్దం పట్టేటువంటి మహా జాతరకు మేడారం అంతా ముస్తాబయింది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివస్తారు. టీఎస్ ఆర్టీసీ జాతర కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ కూడా వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. భక్తులు జాతరలో సమ్మక్క, సారలమ్మలకు మొక్కిన మెుక్కులు చెల్లించుకుంటారు. భక్తులు ఎత్తుబెల్లం సమర్పిస్తారు.
అలాగే మేకలు, కోళ్లు వంటివాటిని అమ్మవార్లకు బలిస్తారు. అలా బలి ఇచ్చిన తరువాత అక్కడే భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో అమ్మవార్లకు బలిచ్చే మేకలు, కోళ్లను కొందరు హలాల్ చేయిస్తారు. అయితే మేడారం ప్రధాన పూజారి అయిన సిద్ధబోయిన అరుణ్ హలాల్ విషయంలో కీలక కామెంట్స్ చేశారు. “ఆదివాసీ సంప్రదాయాల్లో హలాల్ అనేది నిషిద్ధం. దయచేసి హలాల్ చేయకండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మేడారం రావొద్దు. పూజారుల మనోభావాలను, ఆదివాసీ సంప్రదాయాలను దెబ్బతీయెుద్దు” అని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.దాంతో ఈ విషయం చర్చకు దారి తీసింది.
End of Article