Ads
మొదటిసారి ఒంటరిగా రైలు ఎక్కిన ఒక యువతి అక్కడ జరిగిన దృశ్యాన్ని తన అక్కతో పంచుకోవడంతో వాళ్ళ అక్క దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆ సంఘటనపై డైరెక్ట్ గా అధికారులే రంగ ప్రవేశం చేశారు. అసలు విషయం ఏంటంటే 20 సంవత్సరాల ఒక యువతికి పరీక్షలు ఉండడంతో ఒంటరిగా రైలు ప్రయాణం చేయాల్సి వచ్చిందట. చివరి నిమిషంలో టికెట్ కన్ఫర్మ్ అయిందంట.
Video Advertisement
ట్రైన్ మూడు గంటలు లేటుగా రావడంతో తను లోపలికి వెళ్లి తనకు కేటాయించిన సీట్లో కూర్చుందామని చూడగా అప్పటికే అక్కడ ఒక మధ్య వయసు ఉన్న యువకుడు తన కుటుంబంతో సహా కూర్చున్నారట. టికెట్టు లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, తన టికెట్ ని చూపించి తన సీట్ని ఖాళీ చేయమంటే ఆ యువకుడు యువతి మీద అరిచాడట. చేసేదేమీ లేక పై బెర్త్ ఎక్కి కూర్చుంది యువతి.
అక్కడ తనకి అనారోగ్యంగా కూడా ఉన్నది అని వాళ్ల అక్కతో తెలిపింది. ఈ విషయాన్ని తన సోదరితో చెప్పగా తన సోదరి ఈ చాటింగ్ ని స్క్రీన్ షాట్ లు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అది పెట్టిన కొన్ని నిమిషాలకే రైలు సేవ అధికారుల దృష్టిలో పడడంతో వాళ్లు వెంటనే ఆ ట్రైన్ లోకి వెళ్లి ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించి ఆ యువతి సీటు తనకు ఇప్పించారట. కేవలం 20 నిమిషాల్లోనే సమస్యకు పరిష్కారం తెప్పించారు అని ఈ విషయాన్ని అంతటిని యువతి మళ్ళి సోషల్ మీడియాలో పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది.
అత్యవసర సందర్భాలలో సోషల్ మీడియా చాలామంది బాధితులకు సహాయపడుతోంది. సోషల్ మీడియాలో వాళ్ల సమస్యలను షేర్ చేయడం ద్వారా డైరెక్ట్ గా అధికారులకు ఈ విషయం తెలియడంతో వాళ్లు వచ్చి దీని మీద స్పందించడం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కారం ఇవ్వడం వంటి సందర్భాలు జరుగుతున్నాయి.
I contacted railmadad(139) and RPF went there and gave her the seat,within 20 minutes.
Now she is with me,safely!!
Thanks #IndianRailways #railmadad@RailMinIndia https://t.co/wKkJ45bRzG— Potato!🚩 (@Avoid_potato) February 18, 2024
End of Article