Ads
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అక్రమాస్తులలో భాగమైన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని 36వ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తేదీలను నిర్ణయించింది.
Video Advertisement
మార్చి 6,7 తేదీలలో వచ్చి బంగారు వజ్రాభరణాలను తీసుకువెళ్లాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని తీసుకు వెళ్ళటానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని సూచించింది. ఈ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 468 రకాల బంగారు వజ్రాభరణాలు..
700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టుచీరలు, 250 శాలువాలు,12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 4 సి డి ప్లేయర్లు, ఒక వీడియో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డులు, 1,040 వీడియో క్యాసెట్లు, మూడు ఐరన్ లాకర్లు,1, 93, 202 నగదు ఉన్నాయి. 2014లో జయలలితకు అక్రమార్జన కేసులో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, 100 కోట్లు జరిమానా విధించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బిఐ లేదా ఎస్బిఐ ద్వారా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలిపింది.
ఇంతలో జయలలిత మరణించడంతో మళ్ళీ విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, అవసరమైన భద్రతతో రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రెండు రాష్ట్రాలలోని స్థానిక పోలీసులతో అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్టార్ ని ఆదేశించారు.
End of Article