Ads
సాధారణంగా టీవీలో ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజు వస్తోంది అంటే, ఆ రోజుకు సంబంధించి ఒక ఈవెంట్ చేస్తారు. పండగలు, లేదా ఇంకా ఏదైనా స్పెషల్ ఈవెంట్ వస్తుంది అంటే, ఆ రోజుకి ఒక ప్రోగ్రాం చేసి టెలికాస్ట్ చేస్తారు. దానికి ఏదో ఒక థీమ్ ఉంటుంది. అలా ఈసారి ఉమెన్స్ డే కోసం జీతెలుగు ఒక ప్రోగ్రాం రూపొందించారు.
Video Advertisement
ఆడవాళ్ళని సత్కరిస్తూ, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరిని గౌరవిస్తూ ఈవెంట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదల చేశారు. అయితే నిజంగా ఆడవాళ్ళని సత్కరించాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. అందులో ఎటువంటి సందేహం లేదు.
కానీ టిఆర్పి కోసం వీళ్లు చేసే కొన్ని పనుల వల్ల మాత్రం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, అతిధులుగా వచ్చిన వారు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీద ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఈ ప్రోమో. ఇందులో కృష్ణంరాజు గారి భార్య శ్యామల దేవి గారిని, తారకరత్న గారి భార్య అలేఖ్య గారిని పిలిచారు. వారికి సంబంధించిన విషయాలను గుర్తు చేసి, తారకరత్న గారి భార్య ఎదుర్కొన్న సంఘటనలన్నీ కూడా ఒక పాట రూపంలో చూపించారు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా, తారకరత్న గారి భార్య కూడా బాధపడుతున్నారు.
ఇప్పటికే వాళ్లు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి చాలా బాధలో ఉంటారు. ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చి ఆ బాధ నుండి బయటికి రావచ్చు అని అనుకుంటారు. కానీ ఇక్కడికి పిలిచి వీళ్లు అందరి సమక్షంలో ఇలాంటివన్నీ గుర్తు చేసి ఇంకా బాధ పెడుతున్నారు. ఇది మొదటి సారి కాదు. అంతకుముందు కూడా ఇలా ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులని పిలవడం, వారికి సంబంధించిన విషయాలను గుర్తు చేయడం చేస్తారు. అలా చేయడం వలన అప్పటికే బాధలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఇంకా బాధకి గురవుతారు.
అంతకుముందు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చనిపోయాక, ఆయన జ్ఞాపకార్థం ఒక ఈవెంట్ ఏర్పాటుచేసి, అందుకు అతిధులుగా ఎస్పీ శైలజ గారిని, చరణ్ ని పిలిచారు. ఎస్పీ శైలజ గారు అక్కడ అందరి ముందు ఏడ్చేశారు. అలా అంతమంది సమక్షంలో ఎస్పీ శైలజ గారు కంటతడి పెట్టుకోవడం మొదటి సారి. చరణ్ కూడా అలాగే బాధపడ్డారు. అయితే ఈవెంట్ చివరిలో, ఇలాంటి వాటికి తమను పిలవద్దు అని చరణ్ చెప్పారు. ఆయన చెప్పింది నిజమే కదా. ఇప్పటికే బాధలో ఉన్న వారిని ఇంకా బాధ పెట్టడం ఎందుకు. ఇదే విషయం మీద సోషల్ మీడియాలో అందరూ కూడా ఇప్పుడు ఉమెన్స్ డే ప్రోమో చూసి, “ఇలా ఎందుకు బాధ పెడుతున్నారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఈ విషయం మీద మరొక రకమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. “తారకరత్న గారిని మిస్ అవుతున్నాము” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “వీళ్ళందరినీ తెర మీదకి తీసుకురావడం అనే ఆలోచన కేవలం జీ తెలుగు వారికి మాత్రమే చెల్లింది” అంటూ కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఏదేమైనా, ఈ విషయం మీద రెండు భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది సాధారణంగానే ఆలోచించి కామెంట్స్ చేస్తూ ఉంటే, కొంత మంది మాత్రం వారి బాధను చూసి కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : ANANT AMBANI PRE-WEDDING: అంబానీ పెళ్లి అతిథులకు ఆంక్షలా..? అవును,అవేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!
End of Article