VIRAL VIDEO: ఇదేందయ్యా ఇది…”చీర సర్దుకోమని చెప్తే”… 1500 అని సమాధానం ఇచ్చిన మహిళ.!

VIRAL VIDEO: ఇదేందయ్యా ఇది…”చీర సర్దుకోమని చెప్తే”… 1500 అని సమాధానం ఇచ్చిన మహిళ.!

by Harika

Ads

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జనాలకి బాగా అలవాటయింది. అందులో పనికొచ్చే విషయాలు, పనికిరాని విషయాల తో పాటు కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బైక్ మీద వెనకాల సీట్లో కూర్చున్న ఒక మహిళ చీర టైర్ కి తగులుతూ ఉండటాన్ని వెనక మరొక బైక్ మీద వస్తున్న యువతులు గమనిస్తారు.

Video Advertisement

చీర సర్దుకోండి అని ఆమెని హెచ్చరిస్తారు యువతులు. అయితే ఆ హెచ్చరిక కి మహిళ సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే యువతుల హెచ్చరికను అర్థం చేసుకోలేని మహిళ, ఆమే చీర ఖరీదు అడుగుతున్నారేమో అనుకొని చీర 1500rs, చీర1500rs అని సమాధానం చెబుతుంది. ఆ సమాధానం విన్న యువతులు ముందు షాక్ అవుతారు కానీ తర్వాత తెగ నవ్వుకుంటారు.

ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. దీని మీద నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ స్పందన తెలియజేస్తున్నారు. ఆంటీ రాక్,అక్క షాక్ అని కొందరు కామెంట్స్ పెడుతుంటే నీకు అలా అర్థమైందా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

కొందరు ఆమెకు చీరలు పిచ్చేమో అని కామెంట్ పెడితే మరి కొందరు ఫన్నీ ఎమోజీస్ తో కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆరు లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ వీడియో . అంటే నెటిజన్స్ ఈ వీడియోని ఎంతగా ఎంజాయ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్నీ వీడియోలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. అయితే ఇంతకీ యువతి విషయం సరిగ్గా అర్థం చేసుకుందో లేదో, చీర సర్దుకుందో లేదో ఆ వీడియోలో చూపించకపోవడం గమనార్హం.


End of Article

You may also like