తల్లి మృతదేహం దగ్గర గీతాంజలి పిల్లలు…కంటతడి పెట్టిస్తున్న ఫోటో..! అసలేమైంది?

తల్లి మృతదేహం దగ్గర గీతాంజలి పిల్లలు…కంటతడి పెట్టిస్తున్న ఫోటో..! అసలేమైంది?

by Mohana Priya

Ads

కొన్ని రోజుల క్రితం తనకి సొంత ఇల్లు వచ్చింది అంటూ, దాంతో తన కల తీరింది అంటూ, సంతోషంగా మాట్లాడిన మహిళ హఠాన్మరణం చర్చలకు దారి తీసింది. ఆమె పేరు గీతాంజలి. గీతాంజలి తెనాలిలోని ఇస్లాంపేట వాసి. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసించే గీతాంజలికి ఇటీవల ప్రభుత్వం నుండి సొంత ఇంటి పట్టా వచ్చింది.

Video Advertisement

గీతాంజలి భర్త బాలచంద్ర బంగారానికి సంబంధించిన పని చేస్తూ ఉంటారు. ఇటీవల తెనాలిలో వైసీపీ సభ నిర్వహించారు. అందులో గీతాంజలికి సొంత ఇంటి పట్టా ఇచ్చారు. దాంతో గీతాంజలి అక్కడే మీడియాతో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

geetanjali kids incident

దాంతో చాలా మంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. గీతాంజలి ఇప్పుడు రైలు కింద పడి చనిపోయారు అనే వార్త వస్తోంది. అయితే కొంత మంది, “గీతాంజలి ట్రోలింగ్ తట్టుకోలేక ఇలా చేశారు” అని అంటున్నారు. ఇంటి పట్టా అందుకున్నప్పుడు గీతాంజలి మాట్లాడుతూ, “సొంత ఇల్లు నా కల. ఇన్ని రోజులకి ఆ కల నెరవేరింది. నా పేరు మీద ఇంటి స్థలం పట్టా వచ్చింది. ఏ డబ్బులు కట్టకుండానే నాకు ఇంటి స్థలం వచ్చింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా వస్తుంది అనుకోలేదు. స్టేజ్ మీద తీసుకుంటాను అని అసలు అనుకోలేదు. నేను ఏ డబ్బులు కట్టలేదు.”

geetanjali kids incident

“నేను అమ్మ ఒడి పథకం తీసుకున్నాను. మా మామయ్యకి పెన్షన్ తీసుకున్నాను. మా అత్తయ్యకి చేయూత డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థాంక్యూ సో మచ్ జగనన్నా. సార్ గెలుస్తారు. మేము డెఫినెట్ గా ఓట్ మా జగనన్నకే వేస్తాం” అని అన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే, ఇప్పుడు గీతాంజలి చనిపోయారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చి వారం రోజులు అయ్యింది. కానీ ఇప్పుడు విగత జీవిగా ఉన్న గీతాంజలిని చూసి ఏమీ అర్థం కాని పిల్లలు కంటతడి పెడుతున్నారు. ఈ ఫోటో చూస్తున్న ప్రతి ఒకరికి కూడా కన్నీరు తెప్పిస్తోంది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయంపై మాట్లాడుతూ తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : ఈ విషయంలో అంబానీ కన్నా మన చిరంజీవి చాలా గ్రేట్… డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి! ఏం జరిగిందంటే.?


End of Article

You may also like