Home Filmy Adda 20 ఏళ్ల హీరోయిన్…అప్పుడే తల్లి పాత్రలోనా.? ఈ టీజర్ చూసారా.?

20 ఏళ్ల హీరోయిన్…అప్పుడే తల్లి పాత్రలోనా.? ఈ టీజర్ చూసారా.?

by Sainath Gopi

Ads

నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా 100 కోట్లు రాబట్టి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు సొంతం చేసుకుంది ఈ నటి. ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆమె అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఎవరి గురించి ఇంతలా వర్ణిస్తున్నాను అనుకుంటున్నారా.. అదేనండి మన టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి గురించి. ఉప్పెన సినిమాలో ఆమె సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు.

Video Advertisement

list of heroines who are famed as lucky..!!

చాలా చిన్న వయసులోనే ఇంత క్రేజ్ ని సంపాదించుకున్న ఈ భామ సినిమాలు సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేక ఆమె నటించిన సినిమాలు కొన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. నాగచైతన్యతో బంగార్రాజు, కస్టడీ సినిమాల్లో నటించింది. రామ్ పోతినేని తో ది వారియర్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి సినిమాలు చాలా చేసింది.

కానీ ఆమె అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. క్రమంగా ఆమె కెరియర్ గ్రాఫ్ కూడా పడిపోయింది.అయితే ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమాలో బేబమ్మ ఒక పిల్లాడి తల్లిగా కనిపించి అందరికీ షాకిచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో శర్వానంద్ తో ఓ పిల్లోడు ఉంటాడు. అది చూసిన బేబమ్మ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బేబమ్మ అప్పుడే అమ్మయిపోయిందా అంటూ వాపోయారు.

మదర్ రోల్స్ చేయడం తప్పు కాదు గాని మరి ఈ వయసు నుంచే మదర్ రోల్స్ ఏంటి బేబమ్మ అని తెగ ఇదైపోతున్నారు. అయితే తెలుగులో బేబమ్మ కెరియర్ గ్రాఫ్ ఇలా ఉంది కానీ తమిళ, మలయాళం లో ఆమె పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది. తమిళంలో స్టార్ హీరో జయం రవి సరసన జినీ సినిమాలో నటిస్తుంది. తర్వాత మలయాళం లో కూడా స్టార్ హీరో అయిన అటోబినో థామస్ సినిమాలో హీరోయిన్ గా నడుస్తుంది కృతి శెట్టి. మనమే సినిమా హిట్ అయితే ఇక్కడ కూడా మళ్లీ మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.


End of Article

You may also like