Home Filmy Adda ఈ వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు ఎవరో తెలుసా? తెలుగులో టాప్ డైరెక్టర్..!

ఈ వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు ఎవరో తెలుసా? తెలుగులో టాప్ డైరెక్టర్..!

by Sainath Gopi

ఇండస్ట్రీకి ఎంతో మంది డైరెక్టర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీ చరిత్రని తిరగరాసే సినిమాలు చేసి, గొప్ప డైరెక్టర్స్ గా ఎదుగుతారు. అప్పట్లో ఇలా ఉన్న డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటిలో మాత్రం ఇలా ఉన్న వారిలో తెలుగు సినిమా ఇండస్ట్రీని తిరగరాసే సినిమాలు చేసిన మొదటి డైరెక్టర్ ఎవరు అంటే గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. అప్పటి వరకు ఒకలాగా ఉన్న హీరోలు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత వేరే లాగా మారిపోతారు. తన సినిమాలో హీరోలని ఒక కొత్త స్టైల్ లో చూపిస్తారు. అందులో పూరి జగన్నాథ్ స్పెషలిస్ట్.

అందుకే చాలా మంది టాప్ హీరోలు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలి అని ఆశ పడుతూ ఉంటారు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు పూరి జగన్నాథ్. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయిన డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. రామ్ పోతినేని ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ కుటుంబం గురించి మనందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ భార్య లావణ్య గారు అప్పుడప్పుడు బయట కనిపిస్తూ ఉంటారు.

this mla brother is directo

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కూతురు పవిత్ర కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ కూడా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే పూరీ జగన్నాథ్ కి మరొక సోదరుడు ఉన్నారు. ఆయన కూడా మనందరికీ తెలిసిన వారే. కానీ ఆయన సినిమాల్లో లేరు. ఆయన ఒక రాజకీయ నాయకులు. ఆయన పెట్ల ఉమా శంకర గణేష్.

this mla brother is directo

ఉమా శంకర గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నర్సీపట్నం నియోజకవర్గం నుండి 2019 నుండి మెంబర్ గా కొనసాగుతున్నారు. ఉమా శంకర గణేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉన్నారు. పూరి జగన్నాథ్, సాయిరాం శంకర్ తో కలిసి ఉన్న ఒక ఫోటో కూడా ఉమా శంకర గణేష్ షేర్ చేశారు. అయితే, పూరి జగన్నాథ్, ఉమా శంకర గణేష్ అన్నదమ్ములు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు ఏమో.

ALSO READ : అప్పట్లో పాపులర్ అయిన ఈ జెమినీ టీవీ యాంకర్స్ మీకు గుర్తున్నారా..?

You may also like