Home News ధోనితో ఉన్న ఈ పిల్లోడు… ఇప్పుడు ఐపీఎల్‌లో పెద్ద స్టార్… ఎవరో గుర్తు పట్టారా?

ధోనితో ఉన్న ఈ పిల్లోడు… ఇప్పుడు ఐపీఎల్‌లో పెద్ద స్టార్… ఎవరో గుర్తు పట్టారా?

by Mohana Priya

ఇప్పుడు ఉన్న సెలబ్రిటీలు చాలా మంది చిన్న వయసులో ఎంతో మంది ప్రముఖ నటినటులతో ఫోటోలు దిగుతారు. ఆ సమయంలో వాళ్లు కూడా, అదే ఫీల్డ్ లోకి అడుగు పెడతారు అని ఊహించి ఉండరు. అలా సినిమా రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు అప్పట్లో ఉన్న ప్రముఖులతో ఫోటోలు దిగారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు మాత్రమే కాదు. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా అలా వారు స్ఫూర్తిగా భావించే కొంత మందితో వారి చిన్నతనంలో ఫోటోలు దిగారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే, వారితో పాటు వీళ్ళు కూడా కలిసి పని చేసే అంత గొప్ప స్థాయికి ఎదిగారు.

do you recognize this cricketer

అలా ఈ ఫోటోలో ధోనితో ఉన్న చిన్న బాబు ఇప్పుడు ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ అయ్యారు. ధోనితో పాటు ఈ అబ్బాయి కలిసి ఫోటో దిగినప్పుడు అతనికి 6-7 సంవత్సరాలు ఉంటాయి. అతను ఎవరో ఈపాటికి చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. ఆ అబ్బాయి పేరే రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ ప్లేయర్ అయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఆడుతున్నారు. రియాన్ పరాగ్ పూర్తి పేరు రియాన్ పరాగ్ దాస్. నవంబర్ 10వ తేదీ, 2001 లో పుట్టిన రియాన్ పరాగ్, దేశీయ క్రికెట్‌లో అస్సాం తరపున ఆడారు. 2018 లో అండర్ 19 క్రికెట్ వరల్డ్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నారు.

ఇప్పుడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్నారు. రియాన్ పరాగ్ కి చిన్నప్పటినుండి కూడా ధోని అంటే చాలా ఇష్టం. 2019 లో, ధోనీకి అభిమానిగా ఉండడం నుండి ఇప్పుడు ఐపీఎల్ లో గెలవడం వరకు తన జర్నీని గుర్తు చేసుకుంటూ రియాన్ పరాగ్ వీడియో చేశారు. 2021 లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ధోని, రియాన్ పరాగ్ ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోని, వాళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం, రియాన్ పరాగ్ చిన్నగా ఉన్నప్పుడు దిగిన ఫోటోని పోలుస్తూ రాజస్థాన్ రాయల్స్ జట్టు అప్పట్లో ఈ ఫోటోని షేర్ చేసింది.

watch video :

ALSO READ : RGV కథ… సూర్య హీరో… కట్ చేస్తే మహేష్ బాబు కి సూపర్ హిట్..! ఈ సినిమా ఏదంటే..?

You may also like