Ads
సంక్రాంతికి విడుదల కావాల్సిన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిన్న విడుదల అయ్యింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని, దిల్ రాజు గారు నిర్మించారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే, కొంత మంది మాత్రం ఈ సినిమా ఫ్యామిలీస్ కి బాగా నచ్చుతుంది అని చెప్తున్నారు. ఈ సినిమాలో ఒక పొరపాటు జరిగింది. అంటే ఒక సినిమాలో లాజిక్ మిస్ అయ్యింది. హీరో వాళ్ళ కుటుంబం అప్పు కట్టదు.
Video Advertisement
వాళ్లకి అప్పుల్చిన రవిబాబు హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆడవాళ్ళని అవమానిస్తాడు. దాంతో హీరోకి కోపం వచ్చి, కుటుంబం మొత్తాన్ని తీసుకొని రవిబాబు చెప్పిన చోటికి తీసుకెళ్తాడు. హీరో కుటుంబంలో చిన్న పిల్లలు కూడా ఉంటారు. హీరో ఆ పిల్లలతో, విలువలు అంటే ఏంటో నేర్పిస్తాను అని చెప్పి రవిబాబుతో ఫైట్ చేసి, ఆడవాళ్ళని అలా అవమానించడం తప్పు అని ఆ పిల్లలకి అర్థం వచ్చేలాగా చెప్తాడు. అయితే, తర్వాత రవిబాబుకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు, హీరో రవిబాబు ఇంట్లో ఆడవాళ్ళని అవమానించేలాగా ఒక డైలాగ్ చెప్తాడు. దాంతో, ఈ సీన్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముందు హీరో లాజిక్ మాట్లాడి, తర్వాత అదే హీరో విలన్ చేసిన మిస్టేక్ చేయడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది మాత్రమే కాదు. ఈ సినిమాలో ఇలాంటి చాలా సీన్స్ మీద కామెంట్స్ వస్తున్నాయి. హీరోకి తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత రెండు సంవత్సరాల శాలరీని అడ్వాన్స్ గా ఇస్తారు. రెండు సంవత్సరాల జీతం అంటే లక్షల్లో కాదు. కోట్లల్లో ఉంటుంది. అన్ని కోట్ల డబ్బులని ఈ సినిమాలో హీరోకి ముందే ఇచ్చేస్తారు. సాధారణంగా ఎలాంటి కార్పొరేట్ సంస్థల్లో కూడా అలాంటివి జరగవు. ఇంకా ఈ సినిమాలో అయితే ఫారిన్ లో ఉన్న ఆడవాళ్లు, ఇండియాలో ఉన్న ఆడవాళ్లు, ప్రతి పెళ్లి కానీ అమ్మాయి హీరో వెనకాల పడుతుంది అన్నట్టు చూపిస్తారు. దాంతో ఈ సినిమాలో లాజిక్స్ మిస్ అయ్యారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ALSO READ : ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?
End of Article