ఆమెకి 54 ఏళ్ళు… ఆయనకి 52 ఏళ్ళు..! వీరి ప్రేమ కథ ఏంటంటే..?

ఆమెకి 54 ఏళ్ళు… ఆయనకి 52 ఏళ్ళు..! వీరి ప్రేమ కథ ఏంటంటే..?

by Mohana Priya

Ads

ప్రేమకి వయసుతో సంబంధం లేదు అని అంటారు. ఈ విషయాన్ని ఎంతో మంది నిరూపించారు కూడా. కొన్ని సార్లు కొంత మంది ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి చేసుకోరు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకోవడానికి ఎదురు చూడటం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎదురు చూస్తే మహా అయితే సంవత్సరం, రెండు సంవత్సరాలు ఎదురు చూస్తారు. కానీ వీళ్లు పాతిక సంవత్సరాలు ఎదురు చూసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మీరు వింటోంది నిజమే. ఈ సంఘటన నిజంగా జరిగింది. ప్రేమ కోసం పాతిక సంవత్సరాలు ఎదురు చూడడం అంటే చిన్న విషయం కాదు కదా.

Video Advertisement

mohan kumar sudha love story

వివరాల్లోకి వెళితే, సుధ, మోహన్ కుమార్ అనే జంట ఇటీవల పెళ్లి చేసుకున్నారు. సుధ వయసు 54 సంవత్సరాలు. మోహన్ కుమార్ వయసు 52 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ పాతిక సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. కర్ణాటకలో ఉన్న చిక్కమగళూరు జిల్లాలోని అమృతేశ్వర ఆలయంలో దండల మార్పిడి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ పద్ధతిని కువెంపు వివాహ విధానం అని అంటారు. మోహన్ కుమార్ తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని లక్కెనహళ్లికి చెందినవారు. మోహన్ కుమార్ తండ్రి, బాబాయ్ లు కూడా తమ గ్రామంలో పాఠశాల కట్టడం కోసం సొంత భూమిని విరాళంగా ఇచ్చేశారు.

1995 లో అజ్జంపురలో సంపూర్ణ సాక్షరతా ఆందోళన్ వాలంటీర్ల వర్క్‌షాప్‌లో సుధని మొదటిసారిగా కలిశారు. సుధ ప్రవర్తించిన విధానం, ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలు మోహన్ కుమార్ కి నచ్చాయి. మోహన్ కుమార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. సుధా క్షత్రియ మరాఠా వంశానికి చెందినవారు. 2002 లో మోహన్ కుమార్ సుధని ప్రపోజ్ చేశారు. సుధ మోహన్ కుమార్ ప్రేమని ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రజా ఉద్యమాల్లో తలమునకలై ఉన్నారు. ఈ కారణంగా వాళ్లు పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి వారి పెళ్లి ఆలోచన ఆగిపోయేది. వారిద్దరి తల్లులు కూడా వృద్ధులు అయిపోయారు. వివాహం చేసుకోవాలి అని వాళ్ళు పట్టుబట్టారు.

అందుకే ఇప్పుడు సుధ, మోహన్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. చిక్కమగళూరులో సీపీఐ నేత బీకే సుందరేష్ కొన్ని ఉద్యమాలని నిర్వహించారు. ఆ ఉద్యమాల్లో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. సుధ తండ్రి పేరు ఎంఎస్ గణేష్ రావు. ఎమ్మెస్ గణేష్ రావు స్వాతంత్ర సమరయోధులు. సుధ తన తండ్రిని రోల్ మోడల్ గా తీసుకొని ముందుకు వెళ్లారు. సుధ అటవీ నిర్వాసితుల హక్కుల గురించి, వారికి భూముల గురించి పోరాడారు. అంతే కాకుండా, గ్రామీణ మహిళల కోసం స్వయం సహాయక సంఘాలు కూడా ఏర్పాటు చేశారు. సుధ, మోహన్ కుమార్ ఒక అనాధ బిడ్డని దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నారు.


End of Article

You may also like