Ads
కాలం మారింది. కాలంతో పాటు మనుషుల ఆలోచన విధానం కూడా మారింది. అప్పట్లో చిన్న చిన్న విషయాలను కూడా నమ్మే మనుషులు, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలు అన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టారు. ఎవరైనా ఏమైనా చెప్తే, వాళ్లు ఆ విషయాన్ని ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత నిజమా? కాదా? అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు చెప్పింది నమ్ముతారు. వస్తువుల విషయంలో కూడా ఇలాగే చేస్తారు. ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అనుకుంటే, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని, అదే ధరకి ఆ వస్తువు దొరుకుతుందా? లేదా అంతకంటే తక్కువ ధరకే అది దొరుకుతుందా? ఈ వస్తువు దొరికే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అనేవి అన్నీ కూడా చూసుకొని కొనుకుంటున్నారు.
Video Advertisement
కానీ కొన్ని సార్లు మాత్రం తెలిసి తెలియకుండా ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అమాయకంగా కనిపించే వారి దగ్గర, తప్పుడు వస్తువులు అమ్మి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఒక మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆ మహిళ 700 రూపాయలకే ఒక పవర్ బ్యాంక్ కొన్నట్టు తెలిపింది.
ఆ పవర్ బ్యాంక్ ని ట్రైన్ లో కొన్నట్టు చెప్పింది. ఇంటికి వచ్చాక ఆ పవర్ బ్యాంక్ ఓపెన్ చేసి చూస్తే అందులో రెండు బ్యాటరీలు, బలంగా ఉండడానికి ఇసుకతో ఒక మౌల్డ్ లాంటిది తయారు చేసి పెట్టినట్టు చూపించింది. 700 రూపాయలు పెట్టి కొన్న పవర్ బ్యాంక్ లోపల ఇలా ఉంది అని, అంత డబ్బు తీసుకొని వాళ్ళని మోసం చేశారు అని ఆ మహిళ చెప్పింది. తమలాగా ఇలాంటి వాటికి ఇంకా ఎంత మంది మోసపోయారో అని ఆ మహిళ చెప్పింది. కాలం ఎంత మారినా కూడా ఇలాంటి మాటలు చెప్పి వస్తువులు అమ్మే వాళ్ళు ఉంటున్నారు. ఎక్కువ ధరకు వస్తువు అమ్మడం, లేదా అసలు వేరే వస్తువుని అమ్మడం చేస్తున్నారు.
watch video :
చపాతీపిండి కొంటే పవర్ బ్యాంక్ ఉచితం అన్నట్లు ఉంది 😅 పాపం మోసపోయారు pic.twitter.com/T5usvuYCon
— CEO Voice (@CeoVoice_) June 10, 2024
End of Article