Ads
ఈరోజు ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా గురించి. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : హరోం హర
- నటీనటులు : సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్.
- నిర్మాత : సుమంత్ జి నాయుడు
- దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
- సంగీతం : చైతన్ భరద్వాజ్
- విడుదల తేదీ : జూన్ 14, 2024
స్టోరీ :
కుప్పం. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు కలిసి ఉన్న చోట ఉన్న ప్రాంతం. అక్కడ తిమ్మారెడ్డి, అతని సోదరుడు బసవ(రవి కాలె), తిమ్మారెడ్డి కొడుకు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) అధికారం చెలాయిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అక్కడ ప్రజలు అది వినాల్సిందే. అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) ఆ ఊరికి వేరే ఊరు నుండి బతుకుతెరువు కోసం వెళ్తాడు. కుప్పం పాలిటెక్నిక్ కాలేజ్ లో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటాడు.
ఒకరోజు సుబ్రహ్మణ్యంకి, శరత్ రెడ్డికి సంబంధించిన మనిషితో గొడవ అవుతుంది. దాంతో కాలేజ్ వాళ్ళు సుబ్రహ్మణ్యంని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత సస్పెండ్ అయిన తన స్నేహితుడు కానిస్టేబుల్ పళని స్వామి(సునీల్) ని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? తిమ్మారెడ్డి కుటుంబాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? సుబ్రహ్మణ్యంకి ఎదురైన సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కొంత మంది మనుషులు ఒక ఊరి మీద పెత్తనం చేయడం, అక్కడికి ఒక వ్యక్తి రావడం, ఆ వ్యక్తి వేరే ఊరివాడు అవ్వడం, ఆ ఊరి ప్రజలందరినీ కూడా ఆ పెత్తనం చేసే వారి నుండి కాపాడడం, ఆ తర్వాత ఆ ఊరిలో అతను రాజు అవ్వడం. కేజిఎఫ్ నుండి పుష్ప వరకు ఇదే కాన్సెప్ట్ మీద సినిమాలు వచ్చాయి. మధ్యలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా దాదాపు అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చింది. పుష్ప సినిమాలోని చాలా విషయాలు ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా యాస. కుప్పం ప్రాంతం కావడంతో దాదాపు పుష్ప సినిమాలో మాట్లాడినట్టే ఈ సినిమాలో మాట్లాడతారు. సినిమా మొదలైన చాలాసేపటి వరకు కూడా కథలోకి వెళ్ళరు.
పాత్రలు పరిచయం అవ్వడం, వాళ్లందరి ప్రవర్తన చూపించడంతోనే అయిపోతుంది. తర్వాత అసలు కథ మొదలు అవుతుంది. సినిమా తెలిసిన కథ. అయినా కూడా టేకింగ్ పరంగా బాగుంది. స్క్రీన్ ప్లే వేగంగా ఉండడంతో సినిమా చూస్తున్నప్పుడు ఆసక్తిగా అనిపిస్తుంది. ప్రతిసారి కొత్త కథని చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసిన కథ అయినా కూడా బాగా చూపిస్తే ప్రేక్షకులు చూస్తారు. అందుకు ఉదాహరణ ఇది. ఇంటర్వెల్ నుండి సినిమా బాగుంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సీన్స్ గురించి. సినిమాకి ప్రధాన బలం అవే. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి.
ఇలాంటి సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుంటే సీన్స్ అంత బాగా ఎలివేట్ అవుతాయి. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అవ్వడానికి సహాయపడింది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, సుధీర్ బాబుని నవ దళపతి అని పరిచయం చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటన బాగుంది. యాస కూడా చాలా బాగా మాట్లాడారు. సినిమా కోసం ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తున్నంత సేపు అర్థం అవుతుంది.
సుధీర్ బాబు తర్వాత సినిమాలో అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర సునీల్ పాత్ర. యాస పరంగా సునీల్ మాట్లాడుతున్నప్పుడు పుష్ప సినిమా గుర్తొచ్చినా కూడా, సునీల్ కి ఒక మంచి పాత్ర పడింది. సినిమా మొదటి నుండి చివరి వరకు సునీల్ ఉంటారు. చాలా కాలం తర్వాత సునీల్ కి ఇంత మంచి పాత్ర వచ్చింది. తన పాత్రలో సునీల్ చాలా బాగా నటించారు. మాళవిక శర్మకి నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కాకపోయినా కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. జయప్రకాష్, రవి కాలే వంటి నటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 1980 ప్రాంతంలో ఈ సినిమా నడుస్తుంది. ఆ సమయంలోని కుప్పంని కళ్ళకి కట్టినట్లుగా చూపించడానికి సినిమా బృందం ప్రయత్నించారు.
సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ సమయంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. అరవింద్ విశ్వనాథన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎమోషన్స్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ బలంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. కానీ అక్కడ ఈ సినిమాలో కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- సుధీర్ బాబు నటన
- యాక్షన్ సీన్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- ల్యాగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
తెలిసినా కథ అయినా కూడా టేకింగ్ పరంగా బాగుంది. కాబట్టి, కథ తెలిసింది అయినా పర్వాలేదు, కొత్త టేకింగ్ ఉంటే చాలు అనుకుంటే, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలని ఇష్టపడే వారికి అయితే హరోం హర సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :
End of Article