Ads
హైదరాబాద్ లో ఉన్న టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులకి పిలుపునిచ్చారు. తెలంగాణ నిరుద్యోగ యాత్ర పేరుతో జేఏసీ వారు కార్యాలయం ముట్టడించడానికి పిలుపుని ఇవ్వగా, ఎంతో మంది యువత ఇందులో పాల్గొన్నారు. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాల్గొన్న వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష, ఆమె భర్త వెంకటేష్ కూడా ఉన్నారు. పోలీసులు వచ్చి అక్కడ జరుగుతున్న గొడవని కట్టడి చేసే క్రమంలో బర్రెలక్కని అరెస్ట్ చేశారు.
Video Advertisement
గ్రూప్ ఉద్యోగాల పోస్టుల సంఖ్య అని పెంచడం, గ్రూప్-1 మెయిన్స్ కి 1:100 నిష్పత్తి పాటించడం, జాబ్ క్యాలెండర్ విడుదల, జీవో 46 రద్దు వంటి పలు డిమాండ్లతో ఈ ముట్టడి చేశారు. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులతో ఈ నిరుద్యోగుల మార్చ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు వచ్చి ఇందులో పాల్గొన్న యువతని అక్కడి నుండి తరలించారు. ఇందులో పాల్గొన్న బర్రెలక్కని అరెస్ట్ చేశారు. ఆమె భర్త వెంకటేష్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని బర్రెలక్క నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు బర్రెలక్కని అరెస్ట్ చేసి జీపులో తరలించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అని బర్రెలక్క చెప్పారు.
ఇదే విషయం మీద నినాదాలు చేశారు. కొంత కాలం క్రితం, చదువుకున్న కూడా తనకి ఉద్యోగం రాలేదు అని, ఈ కారణంగానే బర్రెల వ్యాపారం చేసుకుంటున్నాను అనే ఒక వీడియో ద్వారానే బర్రెలక్క ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పుడు బర్రెలక్క చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా బర్రెలక్క పోటీ చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు.
watch video :
TGSPSC వద్ద ఆందోళన చేస్తున్న బర్రెలక్కను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/QMqD417lO4
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024
End of Article