Ads
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుండి భారీగా వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్షపు నీళ్ళు వరదలాగా పారుతున్నాయి. విజయవాడ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. జనాలు బయటికి రావడం కష్టంగా మారిపోయింది. స్కూల్స్ కి, కాలేజెస్ కి సెలవులు ప్రకటించారు. అయితే ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పిన ఒక విషయం నిజం అవుతుంది అని అంటున్నారు. బ్రహ్మంగారు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ముక్కుపుడకని వరద నీరు తాకుతుంది అని చెప్పారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు జరగడం ఇది మొదటిసారి కాదు.
Video Advertisement
అంతకుముందు చాలా సార్లు ఇలాగే చాలా విషయాలు జరిగాయి. ఇప్పుడు కూడా అలాగే బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది ఏమో అని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం విజయవాడలో భారీగా వర్షపాతం నమోదు అయ్యింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఇప్పుడు వర్షం కురుస్తోంది. దాంతో బ్రహ్మంగారు చెప్పినట్టే ఇప్పుడు జరుగుతుంది ఏమో అని అందరూ అంటున్నారు. వరద నీరు అంతా కూడా విజయవాడలో చేరడంతో, ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అందులో ప్రజలకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా చాలా వరకు రద్దు అయ్యాయి.
తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి వెళ్లే బస్సులు ఆగిపోయాయి. చాలా మంది రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సహాయక చర్యలను కూడా చేపడుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయొచ్చు అనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున వర్షపాతం నమోదు అవ్వలేదు. వర్షం కొద్దికొద్దిగా తగ్గితే, కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వరద నీరు ఎక్కువగా ఉండడంతో, రక్షణ చర్యలు చేపట్టారు.
End of Article