Ads
‘మసూద’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో తిరువీర్ మరోసారి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. హీరోయిన్గా టీనా శ్రావ్య నటించంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అథర్వన భద్రకాళి పిక్చర్స్ పతాకంపై అగరమ్ సందీప్, అష్మితా రెడ్డి బసని నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కాబోతోంది. కాగా, రిలీజ్‌కు రెండు రోజుల ముందే అంటే నవంబర్ 5 రాత్రి నుంచే ప్రీమియర్ షోలో పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
Video Advertisement

కథ:
రమేష్ అలియాస్ తిరువీర్ విలేజ్‌లో జిరాక్స్ సెంటర్‌తో పాటు ఫోటో స్టూడియో నడిపిస్తుంటాడు. అదే ఊర్లో హేమ అలియాస్ టీనా శ్రావ్య గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుంటారు.. కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఇదే సమయంలో మండల ప్రెసిడెంట్ దగ్గర పనిచేసే ఆనంద్ అలియాస్ నరేంద్ర రవి తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రమేష్ దగ్గరకు వస్తాడు. అతనికి సౌందర్య (యామిని)తో పెళ్లి కుదురుతుంది. ఇక వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ షూట్‌ను రమేష్ అద్భుతంగా షూట్ చేస్తాడు. కానీ ఆ ఫుటేజ్ ఉన్న చిప్‌ను తన అసిస్టెంట్ పొగొడతాడు. దీంతో రమేష్‌కు ఏం చేయాలో అర్థం కాదు. చివరకు ఆనంద్ పెళ్లినే చెడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఆనంద్ స్వయంగా వచ్చి తన పెళ్లి ఆగిపోయిందని చెప్పడతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? చిప్ దొరికిందా? రమేష్, హేమలు ప్రేమ విషయం చెప్పుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే ది ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూడాల్సిందే..

కథ విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కామన్ అయిపోయింది. దాదాపు ఒక 4,5 ఏళ్ల ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చాలా మంది చేసుకుంటున్నారు. అయితే.. దీనికి సంబంధించిన చిప్ పోవడం అనే రియలిస్టిక్ పాయింట్‌ని ఆధారంగా తీసుకుని దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఈ కథను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, రమేష్–హేమ ప్రేమ సన్నివేశాలు, సరదా కామెడీ సీన్లు కథను లైట్‌గా ముందుకు తీసుకెళ్తాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ సన్నివేశాలు, చిప్ మిస్ అవడం వంటి సన్నివేశాలు నేచురల్‌గా కనిపిస్తాయి. కథ కొంత ఊహించదగ్గదైనా, ఇంటర్వెల్ ట్విస్ట్‌లో ఆనంద్ తన పెళ్లి ఆగిపోయిందని చెప్పే సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది.
సెకండ్ హాఫ్‌లో ఎమోషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఫోటోగ్రాఫర్ దృష్టిలో పెళ్లి, జ్ఞాపకాలు, భావాలు అనే థీమ్‌తో వచ్చే డైలాగులు గుండెను తాకుతాయి. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా కొన్ని సన్నివేశాలు తీర్చిదిద్దారు. ఎమోషనల్ సీన్స్ తర్వాత మళ్లీ కామెడీ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను నవ్విస్తూ, క్లైమాక్స్‌లో ఫన్‌తో ముగింపు ఇచ్చారు.
ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు మిస్ అవ్వడం వంటి సిట్యుయేషన్ చాలా రియల్‌గా ఉంటుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే సరదా సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. తిరువీర్ అమాయకంగా, భయపడే పాత్రలో అద్భుతంగా నటించాడు. నరేంద్ర రవి తన పాత్రతో అదరగొట్టాడు. టీనా శ్రావ్య క్యూట్‌గా, సహజంగా ఆకట్టుకుంది. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకి ప్రాణం. కె. సోమశేఖర్ కెమెరా పనితనం విజువల్స్‌కి నేచురల్ ఫీల్ ఇచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌కి ఇచ్చిన ప్రాధాన్యం కథని హృదయానికి హత్తుకునేలా చేసింది. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్లు, లవ్ ట్రాక్‌కి క్లారిటీ లేకపోవడం కాస్త మైనస అనే చెప్పవచ్చు. అంతేకాదు కొన్ని సన్నివేశాలు లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. ఇకపోతే డైలాగ్స్, గ్రామీణ స్లాంగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తం సినిమా నేచురల్‌గా కనిపిస్తుంది.

“ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” అనేది చిన్న బడ్జెట్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ అందించే కామెడీ డ్రామా. రియలిస్టిక్ సిట్యుయేషన్లు, సహజ నటన, సరదా కామెడీతో సినిమాని చివరి వరకు ఆసక్తికరంగా నడిపించారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఈ సినిమా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు…
rating: 3/5
End of Article
