Ads
రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకొని, ఎన్నో అభివృద్దులకి నాంది పలికిన నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్. అయితే, ఇటీవల వీరు ఒక సందర్భంలో కలిశారు. కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. సడెన్ గా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ ,అయ్యాయి. దాంతో, అసలు వీరిద్దరూ ఇలా కలవడానికి కారణం ఏంటి అని వెతకడం మొదలు పెట్టారు నెటిజన్లు.
Video Advertisement

అసలు విషయం ఏంటంటే, వీరిద్దరూ ఇటీవల బెంగళూరులో ఒక ఈవెంట్ కి కలిశారు. ఆ ఈవెంట్ శనివారం జరిగింది. బెంగళూరు శివార్లలోని తరహుణిసెలో సర్జ్ స్టేబుల్స్ లో ఏర్పాటైన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫైనల్ కి ముఖ్య అతిధులుగా వీరిద్దరూ హాజరు అయ్యారు.
ఇందులో అంతర్జాతీయ స్థాయిలో గుర్రపు స్వారీ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో, అంతర్జాతీయ రైడర్లు కూడా పాల్గొన్నారు. వారిలో ఇంటర్నేషనల్ కేటగిరీలో ఎడ్వర్డ్ ష్మిట్జ్, అనస్తాసియా బోండారివా, జైన్ షాజీ సమీర్, వాలెంటిన్ మార్కాట్ వంటి నలుగురు రైడర్లు కూడా ఉన్నారు. ఈ ఈవెంట్ కి అట్రాక్షన్ గా వీరిద్దరూ నిలిచారు. ఈవెంట్ మొదలు అయినప్పటి నుంచి కూడా వీరిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఈ పోటీల్లో విజేతగా నిలిచిన రైడర్లకి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ బహుమతులని అందించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “బెంగళూరు లోని ఒక ప్రైవేట్ మీటింగ్ లో జగన్ అన్నని కలవడం సంతోషంగా ఉంది.” అని రాశారు. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలని కూడా షేర్ చేశారు.
Was great meeting @ysjagan Anna at a private event in Bengaluru pic.twitter.com/8Ix5wPzr8M
— KTR (@KTRBRS) November 23, 2025
End of Article
