Home News ఐదు షేడ్స్‌.. అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. రవితేజ ఎనర్జీ, కమల్ హాసన్‌లాంటి నటనా వైవిధ్యం! ‘గరివిడి లక్ష్మి’తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా రాగ్ మయూర్?

ఐదు షేడ్స్‌.. అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌.. రవితేజ ఎనర్జీ, కమల్ హాసన్‌లాంటి నటనా వైవిధ్యం! ‘గరివిడి లక్ష్మి’తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా రాగ్ మయూర్?

by Sainath Gopi

ఒకే పాత్రలో ఐదు విభిన్న ఛాయలు.. వయసుకు తగ్గ శరీర భాష.. శ్రీకాకుళం యాసలో సహజమైన డైలాగ్ డెలివరీ.. తెరపై కనిపిస్తున్నది రాగ్ మయూరా, సత్తిబాబా అనేంతగా మారిపోయిన నటన! ‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతోంది.

తెలుగు తెరపై హీరోలంటే కేవలం లుక్స్‌, స్టైల్‌, మాస్ ఇమేజ్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒక పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే ఆ పెర్ఫార్మెన్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ‘గరివిడి లక్ష్మి’లో సత్తిబాబు పాత్రతో రాగ్ మయూర్ చేస్తున్న ప్రయత్నం అలాంటిదే.

ఇప్పటివరకు తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్.. ఈ సినిమాలో మాత్రం తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ముఖ్యంగా సత్తిబాబు పాత్రలోని ఐదు విభిన్న షేడ్స్‌ను తెరపై ఆవిష్కరించిన తీరు, వయసుకు తగ్గట్టుగా తనను తాను మలుచుకున్న విధానం ఆయన నటనపై ప్రశంసలు వచ్చేలా చేస్తున్నాయి.

You may also like