Home News ‘నీకై పరుగిడి’ — పార్థు, వెంకటలక్ష్మిల ప్రణయగీతం

‘నీకై పరుగిడి’ — పార్థు, వెంకటలక్ష్మిల ప్రణయగీతం

by Sainath Gopi

“నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పవా?” అని అడిగే వెంకటలక్ష్మి గురించి,

నీకై నేను పరుగిడి…
నీకై నేను జతపడి…*
ఓ ప్రాణమా… నా ప్రాయమా…
నాతో ప్రాణం పంచుకుంటవా! నా పాప లాలనవుతవా!
జన్మలో, మరు జన్మలో నా ప్రేమ పంచుకుంటవా!

అంటూ తన గుండె లోతుల్లో దాచుకున్న ప్రేమను పాటగా చెబుతాడు పార్థు నందన.

‘వెంకటలక్ష్మితో – యాడాది కిందట’** చిత్రంలోని ఈ ప్రణయగీతానికి రామమూర్తి కొట్టాల సాహిత్యం అందించగా, సి. ఎన్. ఆదిత్య సంగీతం సమకూర్చారు. సాయి శరణ్, శృతిక సముద్రాల, మరియు అశ్రిత ఈ గీతాన్ని ఆలపించారు.

ఆలేటి రాజేష్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి రామమూర్తి కొట్టాల రచన, దర్శకత్వం వహించారు. భువన్ విక్రమాదిత్య ఛాయాగ్రహణం అందించగా, సురేశ్ మందల కళా దర్శకత్వం వహించారు.

రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ, శివప్రసన్న, అబ్బా టీవీ హరిబాబు, మహేశ్వర శ్రీశైలం, సాయి చిక్కుల, అశోక్, భజరంగ్ శంకర్, బుద్ధ నాగరాజు తదితరులు నటించారు. మణికంఠ మాస్టర్ అతిథి నర్తకుడిగా కనిపిస్తారు.

You may also like