Ads
జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా అనసూయ పాత్రే కథకు కీలకం అని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు అనసూయ పోలీసు వారిని ఆశ్రయించింది. దానికి కారణం ఏంటో మీరే చూడండి.
Video Advertisement
నెట్ లో చెక్కర్లు కొడుతున్న తన తప్పుడు ఫొటోల విషయంలో పోలీసులను ఆశ్రయించింది. కొన్ని ట్విటర్ ఎకౌంట్ లలో తన ఫొటోలను మార్చడంతో పాటు తప్పుడు పదజాలంతో మాట్లాడుతున్నారని ట్విటర్ సపోర్ట్ టీంకు తెలిపింది అనసూయ. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా వాళ్లు చేసిన కామెంట్స్ ను కూడా జత చేసింది. దీనికి ట్విటర్ సపోర్ట్ తమ రూల్స్ కు విరుద్ధంగా సదరు వ్యక్తులు ప్రవర్తించలేదని మెసేజ్ ద్వారా బదులిచ్చింది. దీంతో అందులో తప్పులేదని చెప్పడం సరికాదని ట్విటర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ. తర్వాత పోలీసును ట్యాగ్ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. వారు చర్యలు తీసుకుంటామని స్పందించారు.
Dear @TwitterSupport .. I urge you to reassess “your rules” .. if this is not violating then what else does.. I won’t shy away to blame you guys as major influence by not contemplating the cyber abuse.. @cybercrimecyb1 Sir I request you to help tag the right authorities pic.twitter.com/G4I3KRwFQ9
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 9, 2020
End of Article