ట్రంప్ ఇండియా రావడానికి కారణం.. ఇండియా లో ఏం చేయనున్నాడు…

ట్రంప్ ఇండియా రావడానికి కారణం.. ఇండియా లో ఏం చేయనున్నాడు…

by Megha Varna

Ads

రెండు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడి రాకకోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది.ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లో ల్యాండ్ కానున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకలతో కలిసి భారత్ లో పర్యటించనున్నారన్న సంగతి తెలిసిందే..అంతర్జాతీయ అంశాల్లో మరింత దూసుకెళ్లేందుకు అమెరికా సహకారం భారత్‌కు ప్రయోజనం కలిగించనుంది. వాణిజ్య పరంగా భారత్‌తో మరిన్ని డీల్స్ కుదుర్చుకునేందుకూ ఈ టూర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మొదట అహ్మదాబాద్‌లో… ఆ తర్వాత ఆగ్రాలో… చివరిగా ఢిల్లీలో పర్యటించి ఫిబ్రవరి 25న తిరుగుపయనం కానున్నారు. ట్రంప్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసారు.

Video Advertisement

సోమవారం ఉదయం 11 గంటలకు ఎయిర్‌‌ఫోర్స్ వన్‌ విమానంలో అహ్మదాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో ల్యాండ్‌ కానున్న ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోడీ, ట్రంప్ కలిసి రోడ్‌షో ద్వారా  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచ అతిపెద్ద  మొతేరా స్టేడియాన్ని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  చేతుల మీదుగా మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభించి,

ఆ తర్వాత వివిధ అంశాల్లో రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకం చేసి, నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భాగంగా ఇరు దేశాధి నేతలూ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30కి ట్రంప్ టీమ్ ఆగ్రా బయలుదేరుతుంది.సాయంత్రం 5గంటలకు ఆగ్రా చేరుకుని తాజ్‌-మహల్‌ను సందర్శిస్తారు. ఇక, రాత్రికి ఢిల్లీ చేరుకుని ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్, మెలానియా దంపతులు బస చేస్తారు

రెండో రోజు అనగా ఫిబ్రవరి 25 న ఉదయం 9.55కి రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్ సందర్శస్తారు…ఆ తర్వాత మోడీ తో కలిసి ఉదయం 10.45కి రాజ్‌ఘాట్‌ చేరుకొని మహాత్మాగాంధీ కి  నివాళులు అర్పిస్తారు.ఉదయం 11.25కి హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-ట్రంప్‌ ఉమ్మడి మీడియా సమావేశం…పలు అంశాల మీద చర్యలు జరిపి రెండు దేశాల మధ్య  పలు ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు.. తరువాత మోడీ గారు ఏర్పాటు చేసిన లంచ్ లో పాల్గొన్నారు ట్రంప్ దంపతులు. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి రాత్రి 8గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులు, రామ్ నాధ్ కోవింద్ ఇచ్చే గౌరవ విందులో పాల్గొన్నారు.అనంతరం రాత్రి 10గంటలకు అమెరికాకు బయలుదేరుతారు.


End of Article

You may also like