Ads
తారాజువ్వలా ఎగిసి పడిన ల్యూక్ జీవితం ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయింది. సాధారణంగా ఏ క్రికెటరైనా తమ కెరీర్‌లో ఒక్కసారైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఆడాలని కోరుకుంటారు. ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే తమ దశే తిరిగి పోతుందని భావిస్తుంటారు. అలాంటిది.. ఒక్కసారి కాదు.. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడి, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో కూడా ప్రాతినిథ్యం వహించిన ఆ క్రికెటర్ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.ఒకప్పుడు కోట్లు సంపాదించిన అతను ఇప్పుడు కూటికి గతి లేక అక్రమాలకు పాల్పడుతున్నాడు.ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్స్‌బ్యాక్. అతని ప్రవర్తనతోనే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.
Video Advertisement
2008 నుంచి 2013 మధ్య వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అతను మొత్తం 17 మ్యాచ్ల్లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్లో 302 పరుగులు చేశాడు. 2008 జరిగిన ఐపీఎల్ లో3 లక్షల డాలర్ల ధరకు ఐపీఎల్ జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ అతనిని కొనుగోలు చేసింది. 2011 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల్యూక్ ను దక్కించుకుంది. 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు ఆడుతున్న సమయం లో ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్ సందర్బం గా ఒక అమెరికన్ యువతిని వేధించాడని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ల్యూక్ ఆ సీజన్ నుండి మధ్యలోనే వెళ్ళి పోయాడు.2013లో మరోసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ల్యూక్..ఐపీఎల్లో తన చివరి మ్యాచ్ 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆడాడు.2014లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.
జనవరిలో జరిగిన రెండు ఘటనల్లో నిందితుడిగా ఉండటంతో బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. బార్ లో గొడవ, బైక్ దొంగతనం ఇలా ఒకటేమీ నిత్యం సమస్యలతో సహవాసం చేసేవాడు . ఎంతలా అంటే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి రోడ్డున పడ్డాడు. కనీసం నిలువ నీడ లేకపోవడంతో కారు డిక్కీలో తలదాచుకునేంతలా . తాజాగా ల్యూక్ మరో సారి దొంగతనం కేసులో అరెస్టై అయ్యాడు. దొంగతనం కేసులో ల్యూక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలం అన్ని రోజులు ఒకేలా ఉండదు అని చెప్పడానికి ల్యూక్ జీవితమే ఒక ఉదాహరణ.
End of Article