Ads
కట్నం తక్కువైందని పెళ్లి ఆగిపోవడం వినుంటారూ..లేదంటే మగపెళ్లివారికి మర్యాదలో లోటు జరిగిందని పెళ్లి ఆగిపోయిందని వినుంటారూ కానీ వరుడి స్నేహితుడు చేసిన పనితో పెళ్లి ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా? విచిత్రంగా ఉంది కదా? వివరాలు మీరే చూడండి…
Video Advertisement
representative image
లోకాదిత్యకు అమృతాచోలికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెద్దలు అంగీకరించి పెళ్లి ఫిక్స్ చేసారు. స్నేహితుల ప్రవర్తన చూసి వరుడి ప్రవర్తనపై అవగాహణకు వచ్చిన పెళ్లి కూతురు బాబోయ్ నీకో దండంరా బాబు, నీ స్నేహితులే ఇలా ఉంటే నీవు ఎలా ఉంటావో నాకు వద్దు నీవు అంటూ పీఠల మీద పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది.
representative image
పెద్దలు ఒప్పుకున్నారని వరుడు వధువు సంతోషపడుతూ ఉన్నారు. పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఒకవైపు పెళ్లి జరుగుతుంటే…మరోవైపు వరుడి స్నేహితుడు ఒకతను ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు అంట. ఆ అమ్మాయి సీరియస్ అయ్యింది. ఇంకేముందు గొడవ పెద్దదైంది.
representative image
వరుడు ఆ స్నేహితుడిని తిట్టకుండా వెనకేసుకువచ్చాడు. అంతేకాదు ఆ అమ్మాయిపై అసభ్యంగా మాట్లాడాడు. దీంతో అతని తీరు చూసి అందరు అవాక్కయ్యారు. ఈ విషయం పెళ్ళికూతురికి కూడా తెలియడంతో అతని ప్రవర్తన నచ్చక పెళ్లి కాన్సల్ చేసుకుంది. అలాంటి ఫ్రెండ్ ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇతను ఇంకెలాంటి వాడో అంటూ వ్యాఖ్యలు చేసింది పెళ్లి కూతురు.
End of Article