మరో ఇటలీగా మారుతున్న అమెరికా…ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో…!

మరో ఇటలీగా మారుతున్న అమెరికా…ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో…!

by Sainath Gopi

Ads

ముందు నుండి చెప్తున్నట్టుగానే కరోనా వైరస్ ని అరికట్టాలంటే వ్యాప్తి చెందించకుండా ఉండడమే మార్గం. అందులో భాగంగానే ఈ జనతా కర్ఫ్యూ. ఇప్పటివరకు కరోనాకి మందు కనుగొనబడలేదు. వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్ని ప్రయత్నిస్తున్నాయి. కనిపెట్టడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అరవైఏళ్ల పై బడిన వారే వైరస్ బారిన పడుతున్నారు. మరణాల శాతం కూడా వారిలోనే అధికం. అందువలన వీరిని ఎట్టి పరిస్థితిలో ఇంటి నుండి బయటికి రానివ్వొద్దని ప్రధాని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అని ఆదేశాలు ఇచ్చారు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా…ఈ కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వనుకుంటుంది. ఇటలీ పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది కరోనా. దేశంలో కేసుల సంఖ్య 36,756కి పెరిగింది. ఒక్కరోజే 12,549 కొత్త కేసులు రికార్డయ్యాయి. 420 మంది వైరస్​కు బలయ్యారు. ఒక్కరోజులో రికార్డ్​ స్థాయిలో 94 మంది చనిపోయారు. కేసుల లిస్టులో ఇటలీ తర్వాతి ప్లేస్​ అమెరికాదే. అంటే ప్రపంచంలో టాప్​ 3 అమెరికానే. ఒక్క న్యూయార్క్​లోనే 21,381 కేసులు నమోదు కాగా, ఒక్కరోజులోనే 11,009 కొత్త కేసులు రిపోర్ట్​ అయ్యాయి.

దీని ఎఫెక్ట్ అక్కడ ఉద్యోగాలపై కూడా పడింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు.కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశం లాక్​డౌన్​ దిశగా సాగుతోంది. పెరిగిపోతున్న కేసులతో న్యూయార్క్​ స్టేట్​ మొత్తాన్ని మూసేశారు. రెండు రోజుల్లోనే కరోనా ఎక్కువ గల కేసుల్లో టాప్ 3 స్థానానికి వెళ్ళింది అమెరికా. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో ఇటలీ ఉండగా..ఇప్పుడు మూడో స్థానంలో అమెరికా చేరింది.


End of Article

You may also like