లాక్ డౌన్ లో పేదలకు సహాయం చేయడంకోసం…ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏం అమ్మారో తెలుసా?

లాక్ డౌన్ లో పేదలకు సహాయం చేయడంకోసం…ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏం అమ్మారో తెలుసా?

by Megha Varna

Ads

ఎంత సొంత వారికైనా డబ్బులు ఇవ్వాలంటే లక్ష సార్లు ఆలోచిస్తారు.కానీ కర్ణాటకకు చెందిన ఇబ్బరు అన్నదమ్ములు మాత్రం తన సొంత స్థలాన్ని అమ్మి మరీ పేదలకు సహాయం చేస్తున్నారు ..కరోనా వైరస్ వలన విధించిన లాక్ డౌన్ వలన ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారు .ఇలా ఇబ్బందులు పడుతున్నవారికి సహాయం చెయ్యాలని అనుకున్నారు కర్ణాటక కోలార్ జిల్లాకు చెందిన తాజుమ్ముల్ పాషా మరియు ముజిమ్మిల్ పాషా అనే ఇద్దరు వ్యాపారవేత్తలు .లాక్ డౌన్ వలన కష్టాలు ఎదుర్కుంటున్న ప్రజలకు తమ భూమి 25 లక్షల రూపాయలకు అమ్మి ఆ డబ్బుతో అవసరం ఉన్న ప్రజలకు సాయం అందిస్తున్నారు .

Video Advertisement

ప్రస్తుత పరిస్థితులలో లాక్ డౌన్ వలన రిజిస్ట్రేషన్ ఆఫీసులు తాత్కాలికంగా నిలిపి వేయడంతో తమ స్నేహితుడికి బాండ్ పాపేరుపై భూమిని రాసి ఇచ్చి అతని దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నామని పాషా బ్రదర్స్ తెలిపారు ..లాక్ డౌన్ గడువు ముగిసాక రెజిస్ట్రేషన్ ఆఫీస్ తెరవగానే ఆ భూమిని తన స్నేహితుడికి రాసి ఇస్తామని తెలిపారు ..

పాషా బ్రదర్స్ ప్రస్తుతం అరటి సాగు మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చేస్తున్నారు ..వీరి బాల్యంలోనే తల్లితండ్రులను కోల్పోయారు .ఆ సాయమానికి తాజుమ్ముల్ కు ఐదు సంవత్సరాలు ,ముజమ్మిల్ కు మూడు సంవత్సరాలు.తల్లితండ్రులను కోల్పోవడంతో అన్నదమ్ములిద్దరూ చిన్నతనంలోనే అమ్మమ్మ ఊరైన కోలార్ కు వచ్చేసారు ..

 

‘మేము తల్లితండ్రులను చిన్నతనంలోనే కోల్పోయాం . దాంతో మేం చిక్‌బాలాపూర్ నుంచి కోలార్‌లోని మా అమ్మమ్మ ఇంటికి వచ్చాం. అలా వచ్చినప్పుడు ఇక్కడి స్థానికులైన హిందువులు, సిక్కులు, ముస్లింలు ఎటువంటి కుల ,మత,ప్రాంత బేధాలు లేకుండా మాకు సహాయం చేశారు. అందుకే ఈ సమయంలో వారికీ సాయపడాలని మేం నిశ్చయించుకున్నాం . లాక్డౌన్ కారణంగా రోజువారీ కూలీలు, కార్మికులు మరియు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూసి.. మా భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాం. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో పేద ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాన్ని కొనాలని నిర్ణయించుకున్నాం’ అని తాజమ్ముల్ పాషా తెలిపారు.

సోదరులిద్దరూ భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుతో ధాన్యంతో పాటు నిత్యావసర సరుకులను కొన్నారు. తమ ఇంటి పక్కనే టెంట్ వేసి కూలీలు మరియు నిరాశ్రయులకు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆ ఇద్దరు సోదరులు 3 వేలకు పైగా కుటుంబాలకు ఆహార ధాన్యాలు, నూనె, చక్కెర మరియు ఇతర నిత్యావసరాలను అందించారు . అంతేకాకుండా హ్యాండ్ అవసరమైన వారికీ 0 శానిటైజర్లు మరియు మాస్కులు కూడా అందిస్తున్నారు . ఈ పంపిణీ జరగడానికి కోలార్ అధికారులు పాసులు జారీ చేశారు. దాంతో ఎటువంటి సమస్య లేకుండా ప్రతిరోజూ సరుకులు మరియు ఆహార పంపిణీ చేస్తున్నారు.


End of Article

You may also like