“గ్యాంగ్ లీడర్” ఫేమ్ “ప్రియాంక” నెక్స్ట్ సినిమా ఎవరితో?

“గ్యాంగ్ లీడర్” ఫేమ్ “ప్రియాంక” నెక్స్ట్ సినిమా ఎవరితో?

by Megha Varna

Ads

ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎవరికైనా, ఎలాంటి ఫీల్డ్ లోనైనా చాలా ముఖ్యం. అందులోనూ సినిమా ఫీల్డ్ లో అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ తొలి సినిమాతో ఎలాంటి ఇంప్రెషన్ కలిగించారన్నది కీలక పాత్ర పోషిస్తుంది. తొలి సినిమాతో విజయం సాధించకపోయినా పర్వాలేదు కానీ మంచి ఇంప్రెషన్ కలిగించగలిగితే చాలు.సరిగ్గా ఇదే కోవకి చెందుతుంది ప్రియాంక అరుళ్ ..కాగా యువత లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ప్రియాంక అరుళ్

Video Advertisement

గత ఏడాది విక్రమ్ కే .కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్  సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా కధానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది..అయితే కన్నడ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రియాంక తెలుగులో కూడా స్టార్ డామ్ తెచ్చుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంది ..

గ్యాంగ్ లీడర్ సినిమాలో సంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ కు అవకాశాలు నెమ్మెదిగా వస్తున్నాయి.గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలైన సమయంలో ఈ భామ గ్లామర్ షో కి దూరంగా ఉంటుంది అని ప్రచారం జరిగింది . శర్వానంద్ తో ఒక సినిమా, నితిన్ తో ఒక సినిమాలో నటించబోతున్నారు అంట ప్రియాంక. గ్యాంగ్ లీడర్ సినిమాలో హోమ్లీగా కనిపించిన ఈ సంప్రదాయమైన భామ తర్వాత ఎలా కనిపించనుందో చూడాలి మరి . గ్లామర్ షోలో కనిపించనుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అది ఎంత వరకు నిజమో వేచి చూడాలి.

 

 

 

 

 


End of Article

You may also like