సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ పోలీసులు ఈ-పాస్‌లు.

సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ పోలీసులు ఈ-పాస్‌లు.

by Megha Varna

Ads

లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు ఈ–పాస్‌లు జారీ చేస్తున్నారు. పర్యాటక స్థలాలను తిలకించేందుకు, వలసకూలీలు, కార్మికులు కూడా లక్షల్లో ఉన్నారు. రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లి, లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుపోయిన వారూ వేలల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఈ–పాస్‌లు జారీ విధానాన్ని శనివారం రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు.

Video Advertisement

వలసకూలీలు, కార్మికులు ,విద్యార్థులు తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్‌ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్‌ మాత్రమే జారీ చేస్తామని వెల్లడించారు. ఈ–పాస్‌ అవసరమైన వారు సంబంధిత పేరు,  ఫోన్‌ నెంబర్,మెయిల్‌ ఐడీ, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత వీలైనంత త్వరగా ఈ-పాస్‌లు జారీచేస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు.


End of Article

You may also like