Ads
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కరోనాకు ఎలా అయితే దేశం ప్రాంతం చిన్న, పెద్ద తేడా లేదో అలాగే లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలేంటి సెలెబ్రెటీలు కూడా ఇబ్బంది పడక తప్పడం లేదు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా హైదరాబాద్ లో ఆమె భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు …వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ఒక్కప్పుడు భారత్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా.ఆమెను చూసి స్ఫూర్తి పొంది చాలామంది అమ్మాయిలు టెన్నిస్ ఆటను మొదలుపెట్టారు.కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వలన దాదాపు రెండు సంవత్సరాలు ఆటకు దూరమై మళ్ళీ తిరిగి టెన్నిస్ ఆడుతున్నారు సానియా మీర్జా.ఈ నేపథ్యంలో అన్ని దేశాలు తిరుగుతూ టెన్నిస్ ఆడుతూ చివరగా లాక్ డౌన్ విధించే సమయానికి హైదరాబాద్ లో ఉండిపోయారు సానియా మీర్జా .కాగా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతూ లాక్ డౌన్ విధించే సమయానికి పాకిస్తాన్ లోనే ఉండిపోయారు.
లాక్ డౌన్ కారణంగా నా భర్తను చూడకుండా నేను , తండ్రికి దూరమై నా కొడుకు ఇజన్ చాలా బాధపడుతున్నామని అవేధేన వ్యక్తం చేసారు సానియా మీర్జా.ఇప్పుడు షోయబ్ వృద్ధురాలు అయిన తన తల్లిని చూసుకుంటున్నారని ఒకరకంగా అదే మంచిది అయిందని ఒకవేళ షోయబ్ మాతోపాటు ఉంటె ఈ కరోనా లో తన తల్లి ఎలా ఉన్నారో అని భయపడాల్సి వచ్చేది అని సానియా తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ ఆడేందుకే మళ్ళీ నేను తిరిగి టెన్నిస్ ఆడటం మొదలుపెట్టానని సానియా తెలిపారు ..గతంలో కూడా ఒకసారి ఫామ్ కోల్పోయినందుకు చాలా కష్టపడ్డానని మళ్ళీ తిరిగి అదే పరిస్థితి వచ్చిందని సానియా వెల్లడించారు.ఆట మీద మంచి పట్టూ సాధించడానికి సరైన ప్రాక్టీస్ అవసరమని ఆ దిశగా ముందుకు వెళ్తున్నాను అని అన్నారు.కాగా కరోనా కారణంగా భవిష్యత్తులో చాలా మార్పులు మానవ జీవితంలో వస్తాయని క్రీడలలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయని సానియా అభిప్రాయపడ్డారు.
End of Article