Ads
బుల్లితెరపై ఎన్నో షోస్ మొదలై అంతలోనే మాయమవుతుంటాయి. కొన్ని షోస్ మాత్రమే జనాధారణ పొందుతాయి.అలాంటి షోస్ లో ముఖ్యంగా జబర్దస్త్ ఇప్పటికి ఎప్పటికి ప్రజలకు గుర్తిండిపోతుంది ఎందుకంటే జబర్దస్త్ చూస్తూ కుడుపుబ్బా నవ్వుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ.జబరదస్త్ లో నటించి తర్వాత వెండితెరకు పరిచయం ఐన వారు చాలామందే ఉన్నారు.వీరిలో చమ్మక్ చంద్ర కూడా ఉన్నారు . ఈ మధ్యకాలంలో జబర్దస్త్ మానేసి జీ తెలుగు అదిరింది షో చేస్తున్నారు చమ్మక్ చంద్ర .కాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు .ఆ వివరాలేంటో చూద్దాం ..
Video Advertisement
మీ టీం లో నటించిన సత్య అనే అమ్మాయి గురించి చెప్పండి అని యాంకర్ ప్రశ్నించారు.దానిపై చమ్మక్ చంద్ర స్పందిస్తూ నా స్కిట్స్ లో నాతో పాటు చేసే లీడ్ పెయిర్ చాలా ఇంపార్టెంట్.అప్పటిదాకా వినోద్ నాతో పాటు చేసేవాడు.మా ఇద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.కానీ ఆ మధ్యకాలంలో వినోద్ కు హౌస్ ఓనర్ తో గొడవ జరిగింది.ఆ ఘటనలో వినోద్ బాగా గాయపడ్డాడు.దీంతో వినోద్ ఆరోగ్యం బాగోకపోవడం వలన షో చెయ్యలేకపోయాడు అని తెలిపారు.
Also Check: JABARDASTH & ADIRINDI ACTRESS SATYA SRI IMAGES, AGE, PHOTOS, FAMILY, BIOGRAPHY, MOVIES
నాకు లీడ్ పెయిర్ చాలా అవసరం అయింది.ఎందుకంటే స్కిట్ బాగా నడవాలంటే నాతో పాటు ఉండే ఇంకో పాత్ర చాలా ముఖ్యం. ఎవరినైనా కొత్త అమ్మాయిని తీసుకుంటే మళ్ళీ ఆ అమ్మాయి ప్రేక్షకులకు అలవాటు అవ్వడానికి 15 ఎపిసోడ్స్ పైనే పడుతుంది.కాబట్టి సత్య అనే అమ్మాయిని తీసుకోవాల్సి వచ్చింది అని చమ్మక్ చంద్ర తెలిపారు.సత్య అనే అమ్మాయి అప్పటికే నాతో 3 ఎపిసోడ్స్ చేసారు.కాగా ఆమె పండించే కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది అని తెలిపారు.
జబర్దస్త్ తర్వాత చమ్మక్ చంద్ర కు పలు సినిమాలలో నటించారు.మీరు నటించిన సినిమాలలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది అని అడగగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అఆ అని తెలిపారు.ఆ సినిమాలో పాత్ర చిన్నదైనా మంచి గుర్తింపు తెచ్చింది అని తెలిపారు చమ్మక్ చంద్ర .తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన అల వైకుంఠపురంలో అనే సినిమాలో కూడా నటించారు చమ్మక్ చంద్ర.కాగా రాజా ది గ్రేట్, టాక్సీవాలా ఇంకా పలు చిత్రాలతో నటించారు చమ్మక్ చంద్ర.
ఏదేమైనా జబర్దస్త్ స్టేజి మీద అప్పటివరకు మగవారే ఆడవాళ్ళ గెటప్ వేసి కామెడీ పండించారు…కానీ ఓ అమ్మాయిని స్టేజి మీదకి తీసుకొచ్చి ఆమెతో అంతగా కామెడీ చేయించిన ఘనత మాత్రం చమ్మక్ చంద్రకె సాధ్యమైంది. ఆమె పేరు సత్య శ్రీ అని కూడా చాలామందికి తెలియదు. చంద్ర టీం లో ఆమె టైమింగ్ బాగా క్లిక్ అవుతుంది. వారిద్దరి జోడి అందుకే హిట్ పెయిర్ గా నిలిచింది.
జబర్దస్త్ తర్వాత “అదిరింది” షోలో కూడా ఇద్దరు అదే కామెడీ టైమింగ్ కంటిన్యూ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. రాజా ది గ్రేట్, ఆర్‌డిఎక్స్ లవ్ లాంటి సినిమాల్లో కూడా నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం అదిరింది షో ద్వారా ఆమెకు మరిన్ని ఆఫర్స్ రావాలని కోరుకుందాము.
End of Article