పోలీసులు ఆపారని 10 రూపాయల నోటును మాస్క్ లా పెట్టుకోవాలనుకున్నాడు…చివరికి??

పోలీసులు ఆపారని 10 రూపాయల నోటును మాస్క్ లా పెట్టుకోవాలనుకున్నాడు…చివరికి??

by Megha Varna

Ads

కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు సామాజిక దూరం పాటించడం ఒకటే మన ముందు ఉన్న ఏకైక మార్గం .కాగా ప్రతీ ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు మాస్క్ లు ధరించడం తప్పనిసరి.కానీ కొంతమంది మాత్రం ఇవేవి పట్టించుకోకుండా విచ్చలవిడిగా రోడ్ల మీద మాస్క్ లు లేకుండా సంచరిస్తున్నారు.ఈ నేపథ్యంలో మీరట్ అనే యువకుడు మరియు అతని స్నేహితుడు అమిర్ పోలీసులకు పట్టుబడినప్పుడు ఒక వ్యక్తి రుమాలు ను మాస్క్ ల ఉపయోగించుకున్నాడు .

Video Advertisement

కాగా మరొక వ్యక్తి 10 రూపాయల కాగితాన్ని మాస్క్ ల ఉపయోగించాడు.అమిర్ 10 రూపాయల కాగితాన్ని మాస్క్ ల ఉపయోగించగా పోలీసులు ఎందుకు మాస్క్ ధరించలేదు అని అడిగారు.దానికి అమీర్ మాస్క్ కొనడానికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది కానీ నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని సమాధానమిచ్చాడు.అయినా మేము మా ఓనర్ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి రోడ్ మీదకి రావాల్సి వచ్చింది అని చెప్పారు.

దీంతో పోలీసులు వారికి రెండు మాస్క్లను అందచేశారు.దీంతో సదరు వ్యక్తులపైనా ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసారు.వారు కాంట్రాక్టు పనులు చేసే కార్మికులు అని పోలీసులు గుర్తించారు..కరోనా వైరస్ కారణంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించడం తప్పినిసరి అని మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా తో పాటు కేసు కూడా నమోదు చేస్తామని కావున ఎవరూ కూడా మాస్క్ లేకుండా బయటకి వచ్చి కరోనా వ్యాప్తి చెందేలా చెయ్యద్దు అని పోలీసులు విజ్ఞప్తి చేసారు .


End of Article

You may also like