కంటతడి పెట్టిస్తున్న ఐశ్వర్య రియల్ స్టోరీ…ఆర్థిక ఇబ్బందులు, కుటుంభంలో వరస మరణాలు!

కంటతడి పెట్టిస్తున్న ఐశ్వర్య రియల్ స్టోరీ…ఆర్థిక ఇబ్బందులు, కుటుంభంలో వరస మరణాలు!

by Megha Varna

Ads

జీవితం ఒక్కొక్కరికి ఒక్కోరకమైన పరీక్ష పెడుతూ ఉంటుంది.జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు కూడా మొదట్లో చాలా కష్టాలను చూసాం అని చెప్తూ ఉంటారు.సినిమా పరిశ్రమలో అయితే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఒక్కొక్కరిది ఒక్కో కథ.అయితే ప్రముఖ సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా తన చిన్నతనంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు.చిన్ననాటి నుండే ఆమె కష్టంతోనే తన కుటుంబాన్ని ముందుకు నడిపారు..ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటిని దాటుకొని ముందుకు ఎలా వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

ఐశ్వర్య రాజేష్ చెన్నై లోని స్లమ్ ఏరియాలో నివాసం ఉండేవారు.ఐశ్వర్య రాజేష్ ధీ పేద కుటుంబం.ఐశ్వర్య కు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించారు.దీంతో కుటుంబ ఆర్ధిక పరిస్థితి దయనీయ్యంగా తయారు అయింది.అయితే తండ్రి మరణాన్ని జీర్ణించుకోకముందే ఐశ్వర్య పెద్ద అన్నయ్య మృతి చెందారు.ఆ తర్వాత సంవత్సరం పూర్తికాకముందే ఐశ్వర్య రాజేష్ చిన్న అన్నయ్య రోడ్ ప్రమాదంలో మృతి చెందారు.దీంతో చిన్నతనంలోనే ఐశ్వర్య రాజేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.అప్పటి నుండి ఐశ్వర్య తన ఒంటరి తల్లితో నివాసం ఉంటూ టీవీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించారు.

అయితే అప్పట్లో సీరియల్ లో నటించినందుకు గాను చాలా తక్కువ పారితోషకం వచ్చేది ఐశ్వర్య రాజేష్ కు.ఆ తర్వాత తన తల్లి సలహా మేరకు సినిమాలలో నటించడం మొదలుపెట్టారు.చిన్నతనం నుండే సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఐశ్వర్య రాజేష్.ఆ తర్వాత సన్ టీవీ లో ఓ రియాల్టీ షో లో హోస్ట్ గా వ్యవరించారు.ఆ తరువాత తమిళ ,కన్నడ,మలయాళం లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు ఐశ్వర్య రాజేష్.తెలుగులో రాంబంటు అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఐశ్వర్య రాజేష్.


End of Article

You may also like