Ads
అనాది కాలం నుండి కూడా మనుషులకు ,కుక్కలకు విడదియ్యలేని బంధం ఉంది.కుక్కలు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మనుష్యులతో కలిసిపోతాయి.కుక్కలకు ఉన్న విశ్వాసం మనుష్యుల కు కూడా ఉండదని ఓ సామెత చెప్తూ ఉంటారు.అందుకే మొదట నుండి కుక్కలను నమ్మకానికి ,విశ్వాసానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు.అయితే తాజాగా చైనాలోని వుహాన్ లో ఓ కుక్క తన యజమాని కోసం 3 నెలలకు పైగా ఎదురుచూస్తూ ఉంది.ఈ ఘటన అందరి కళ్ళు చెమర్చేలా చేస్తుంది.వివరాల్లోకి వెళ్తే…
Video Advertisement
చైనా లోని వుహాన్ లో ఓ వ్యక్తి గ్జియావో బేవో అనే కుక్కను చాలాకాలంగా పెంచుకుంటున్నాడు.అయితే ఆ వ్యక్తి అనారోగ్యం రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.ఆ సమయంలోను బేవోను తన వెంట ఆసుపత్రికి తీసుకువెళ్లాడు ఆ వ్యక్తి..అయితే ఆ వ్యక్తికీ మొదటగా కొంత అస్వస్థతగా ఉండడంతో ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది.ఆ సమయంలోను బేవో తన యజమాని కోసం ఎదురుచూస్తూ ఉంది.కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికీ కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందించగా ఆ వ్యక్తి మరణించాడు.
కానీ ఆ విషయం తెలియని బేవో అక్కడే ఉండీ తన యజమాని కోసం నిరీక్షిస్తూ ఉంది.దీంతో ఆసుపత్రి సిబ్బందికి మనసు చెలించి బీవోని వేరే వారి ఇంటి దగ్గర ఉంచారు.కానీ బేవో మళ్ళీ అక్కడ నుండి తిరిగి ఆసుపత్రి కి వచ్చి తన యజమాని ని వెతుక్కుంటూ తిరుగుతుంది.తన ఓనర్ ఇంకా తిరిగి రాడు అని తెలియక బేవో ఆలా నిరక్షించడం అందరి హృదయాలను కదిలించివేస్తుంది.కుక్క కాబట్టి అంత విశ్వాసం ఉంది బెవో కి అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
End of Article