లాక్ డౌన్ వేళ ధోని ఎలా టైం పాస్ చేస్తున్నారో చెప్పిన సాక్షి.!

లాక్ డౌన్ వేళ ధోని ఎలా టైం పాస్ చేస్తున్నారో చెప్పిన సాక్షి.!

by Megha Varna

Ads

భారత దేశ క్రికెట్ అభిమానులు ఎప్పుడూ మర్చిపోలేని కెప్టెన్ ఎవరు అంటే వెంటనే తెరపైకి వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని.ఎందుకంటే ఇప్పటిదాకా భారత్ కు రెండు ప్రపంచ కప్ లు మరియు ఛాంపియన్స్ ట్రోఫీ కప్ ను తీసుకువచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పటిదాకా జరగాల్సిన ఎన్నో క్రికెట్ మ్యాచ్ లు వాయిదా పడ్డాయి.సెలెబ్రిటీలు అందరు ఇంట్లో పనులు చేస్తూ తమ కాలాన్ని గడుపుతున్నారు. అయితే ధోని ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఇటీవలే సాక్షి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Video Advertisement

ధోని భార్య ఇటీవల ఒక లైవ్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రేక్షకులతో ముచ్చటించారు.అయితే ఈ లైవ్ ప్రోగ్రాంలో భాగంగా ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు సాక్షి.ఈ మధ్యకాలంలో ధోని “పబ్ జి” గేమ్ ఎక్కువగా ఆడుతున్నారని సాక్షి తెలిపారు.  అలాగే ఎప్పటిలాగే తన బైకులతో కూడా సమయాన్ని గడుపుతున్నారని సాక్షి తెలిపారు. రోజు మొత్తం పబ్ జి ఆడుతున్నారు. నిద్రలో కూడా పబ్ జి గురించే కలవరిస్తున్నారు. మాకంటే పబ్ జి గేమ్ ధోనికి ఎక్కువైపోయింది అంటూ హాస్యాస్పదంగా కామెంట్ చేసారు సాక్షి. ఆ వార్త వైరల్ అవ్వటంతో, ధోని కూడా మనలాగే పబ్ జి ఎక్కువ ఆడుతారు అంటూ కొంతమంది యూత్ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

వికెట్ కీపర్ గా కూడా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న మహేందర్ సింగ్ ధోని రిటైర్మెంట్ పై ఎప్పటినుండో అంతటా చర్చలు మొదలయ్యాయి.అయితే మిస్టర్ కూల్ ధోని భార్య సాక్షి ధోని రిటైర్మెంట్ పై ఓ ట్వీట్ చేసారు.అయితే ఆ ట్వీట్ ఇప్పుడు అంతటా వైరల్ గా మారింది..వివరాల్లోకి వెళ్తే ..

అయితే కొద్ది రోజుల క్రితం ధోని టెంపరరీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ధోని పూర్తిగా క్రికెట్ కి దూరం అవుతున్నారని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే దీనిపై సాక్షి స్పందిస్తూ …”ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలు నిజం కాదు …లాక్ డౌన్ కారణంగా ప్రజలు పిచ్చోళ్లుగా మారిపోయారేమో అని అనిపిస్తుంది”అని ట్వీట్ చేసారు.కానీ కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను తొలగించారు సాక్షి .


End of Article

You may also like