పైనాపిల్ లో పటాకులు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగుని…మానవత్వం నశించిన వేళ.!

పైనాపిల్ లో పటాకులు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగుని…మానవత్వం నశించిన వేళ.!

by Megha Varna

Ads

కేరళ లోని పల్కడ్ జిల్లా లోని సైలెంట్ వ్యాలీ లో ఓ విషాదం చోటు చేసుకుంది.కొన్ని రోజులలో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న ఏనుగు ఆకలి తట్టుకోలేక ఆహారం కోసం పక్కనే ఉన్న గ్రామానికి వచ్చింది.అయితే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ఆ ఏనుగుకు కు పేలుడు పదార్ధాన్ని ఆహారంగా ఇవ్వడంతో నోటిలోనే పేలుడు సంభవించి ఆ ఏనుగు మృతి చెందింది..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement


తీవ్రమైన ఆకలితో ఆహారం కోసం గ్రామంలోకి వచ్చిన ఏనుగు కు పేలుడు పదార్ధాన్ని అందచేశారు స్థానికులు.ఆ ఏనుగు ఎంతో నమ్మకంతో నిజంగా ఆహారం ఏమో అని దానిని తినేసింది.కానీ కొద్ది సేపటికి ఆ ఏనుగు నోటిలో భారీ పేలుడు జరగడంతో ఆ ఏనుగు ఒక్కసారిగా షాక్ కు గురయింది.అయినా కానీ ఆ ఏనుగు ఎవరిని ఏమి చెయ్యలేదు.ఏ ఇంటిని కూడా ద్వాంసం చెయ్యలేదు.దీంతో వెంటనే దగ్గరలో ఉన్న కాలువ లోకి వెళ్లి నిలబడింది.పేలుడు వలన ఆ ఏనుగు నాలుక ,గొంతు కూడా తీవ్రంగా దెబ్బతిని భారీగా రక్త స్రావం జరిగింది.దీంతో వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ రంగంలోకి దిగింది.

 

ఆ ఏనుగు ను బయటకు తియ్యడానికి చాలా గంటలు ప్రయత్నించినా లాభం లేకపోయింది.చివరికి నీటిలోనే ఆ ఏనుగు మరణించింది.దీనిపై అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.ఈయన సోషల్ మీడియా లో ఈ విషయాన్ని షేర్ చెయ్యడం వలెనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ స్పందిస్తూ ..ఆ ఏనుగు అందరిని నమ్మింది అందుకే పేలుడు పదార్ధాన్ని ఇచ్చిన నమ్మకంతో తినేసింది..ఆ ఏనుగు చాలా మంచిది అందుకే అది ఎవరిని ఏమి చెయ్యలేదు ఇంకా ఏ ఇంటిని కూడా నాశనం చెయ్యలేదు.అది చనిపోయే ముందు దాని గురించి అలోచించి ఉండదు ఇంకా కొద్ది రోజులలో పుట్టబోతున్న తన బిడ్డ గురించి అలోచించి ఉంటుంది అని అన్నారు.పేలుడు సంబవించాకా ఆ బాధను తట్టుకోలేక ఉపశమనం కోసమే నీటిలోకి వెళ్లి నిలబడింది అని అన్నారు.

అనంతరం ఆ ఏనుగు కి పోస్ట్ మార్టం నిర్వహించిన వ్యక్తి మాట్లాడుతూ …అది చనిపోయే ముందు తన బిడ్డ గురించి ఎంతగా మదన పడిందో దాని కళ్ళు చుస్తే అర్ధం అవుతుంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు.అనంతరం ఆ ఏనుగు మృత దేహాన్ని అది పుట్టి ,పెరిగిన అడివిలో లారీ లో తిప్పుతూ ఘన నివాళులు ఇస్తూ అడివిలో ఆ ఏనుగుకు అంత్య క్రియలు జరిపించారు అటవీశాఖ అధికారులు..ఈ ఏనుగు కు అందరూ కూడా ఘన నివాళులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఏనుగు దానికి అర్హురాలు అని అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ అన్నారు .


End of Article

You may also like