వైరల్ ఫోటో: అసలు కథ తెలుస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

వైరల్ ఫోటో: అసలు కథ తెలుస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

by Megha Varna

Ads

ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఆడిపిల్లకు చదువెందుకు? ఉద్యోగం ఎందుకు?? అసలు ఆడపిల్లకు పుట్టకెందుకు??? అని అనుకునే వారెందరో.. కానీ ఇవేవి కేరళ రాష్ట్రంలో చెల్లవు..చదువుకి ఆడా మగా అనే తేడాలేదు..అందరూ చదువుకోవాల్సిందే, అందరికి విద్య అందాల్సందే.. అందుకే అక్షరాస్యత శాతంలో దేశంలోనే నెంబర్ వన్.. విద్యార్దుల కోసం ఇప్పటికే రకరకాల సౌకర్యాలు కల్పించిన కేరళ.. ఇప్పుడు ఒక్క విద్యార్దిని కోసం చేసిన పని యావత్ దేశం అంతా మెచ్చుకునేలా చేస్తుంది.

Video Advertisement

బోటులో ప్రయాణిస్తున్న ఒక అమ్మాయి ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరలవుతోంది..కాలేజీ యూనిఫామ్, ఒడిలో పుస్తకం, పక్కనే బ్యాగ్.. ఇప్పుడ కాలేజీలు, స్కూల్లు లేవు కానీ ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ని సడలించి పరిక్షలు అమలుచేస్తున్నాయి రాష్ట్రాలు..కేరళ కూడా ఇంటర్ విద్యార్దులకు మిగిలిపోయిన పరీక్షలను నిర్వహించింది..ఫోటోలో ఉన్న శాండ్రా కూడా ఆ పరీక్షలు రాయడానికే వెళ్తుంది.

అళ‌ప్పుర జిల్లాలోని కైన‌క‌రి ప్రాంతం లో నివాసం..అక్కడి నుండి పరీక్ష రాయడానికి కొట్టాయం జిల్లాలోని కాంజీరాం కు వెళ్లాలి..అక్కడికి వెళ్లాలంటే పడవ ప్రయాణం ఒక్కటే మార్గం..లాక్ డౌన్ కారణంగా జనాలు లేరు, పడవలు నిలిపివేశారు..దాంతో చేసేదేం లేక వాటర్ ట్రాన్స్ప్రోర్ట్ అధికారులకు తన సమస్య వివరించింది.. రెండే పరీక్షలు ఉన్నాయని..తన ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని విన్నవించుకుంది.

అధికారులు ఒప్పుకున్నారు..ఒక్క విద్యార్ధిని కోసం రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు..తనని పరీక్షలకు తీస్కెళ్లడం మళ్లీ తన ఊరిలో దించడం..రెండు రోజుల పాటు తనొక్క దానికోసం బోటుని నడిపారు..ఇందులో పెద్ద విశేషమే ఉంది..కేవలం ఒక్క బోటుని నడపడం అంటే మాటలు కాదు..ఇది సుమారు 70మంది ప్రయాణికులు ప్రయాణించే బోటు..ఒక్క ట్రిప్పుకి వచ్చే ఆదాయం 4000 రూపాయలు..కానీ సండ్ర దగ్గర సాధారణ ఛార్జి 9 రూ. తీసుకున్నారు..రెండు వైపులకు 18రూ.. రెండు రోజులకు 36 రూపాయలు మాత్రమే ఆదాయం..

మొత్తానికి పరీక్షలు రాసింది శాండ్రా..కాదు రాసేలా తమ సాయం అందించింది ప్రభుత్వం..ఈ ఒక్క ఉదాహరణ చాలు కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఎందుకు ఉందో అర్దం అవ్వడానికి..కేవలం ఇది మాత్రమే కాదు..కరోనా కలకలం ప్రారంభం అవ్వడానికి ముందు నుండి కేరళ అనుసరిస్తున్న విధానాలు కరోనా పూర్తిగా అంతమొందించడానికి, చేస్తున్న కృషి, ప్రజలకు చేస్తున్న సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువే.. తమ రాష్ట్రప్రజలకు మాత్రమే కాదు, వలస కార్మికులను కూడా ఏ ఒక్కరిని కష్ట పెట్టకుండా చూసుకున్నారు. వాళ్లు వలస కార్మికులు కాదు అతిధి కార్మికులంటూ వారికి ఒక గౌరవాన్నిచ్చిన రాష్ట్రం కేరళ..


End of Article

You may also like