Ads
హమ్మయ్య మిడతల బాధ తెలుగు రాష్ట్రాలకు లేనట్టే.. తెలంగాణా రాష్ట్రానికి 400కిమి దూరంలో ఉన్న మిడతలు రెండు రోజుల్లో తెలంగాణాలోకి, తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశిస్తాయి అని వచ్చిన వార్తలు ఎంతో కలవరపెట్టాయి..కానీ మిడతలు తమ రూటు మార్చుకున్నట్టుగా శాస్త్రవేత్తలు తెలిపడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టయైంది..మధ్యప్రదేశ్ వైపుగా పయనించిన మిడతలు ప్రస్తుతం చత్తీస్ ఘడ్ అడవులకి చేరాయి.
Video Advertisement
నిసర్గ తుఫాన్ కారణంగా వీచిన గాలుల కారణంగా మిడతలు మధ్యప్రదేశ్ నుండి చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ వైపుకి పయనించాయి. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుండి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చేరుకున్న మిడతలు తెలంగాణాకి 400కి.మీ దూరంలో ఉండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు మరియు ప్రజలు ఆందోళన చెందారు..కానీ అవి రూట్ మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు వెళ్లాయి. తాజా సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘడ్ అడవుల్లోకి మిడుతల దండు ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లోని కొరియా జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి మిడుతలు ప్రవేశించాయి.
మిడతలు మరియు ఇతరత్రా ఎగిరే ప్రాణులు గాలిని ఆధారంగా చేసుకొని ప్రయాణిస్తుంటాయి.గాలి వీచే దిశకు వ్యతిరేఖంగా ప్రయాణించాలంటే అవి తమ శక్తిని 3రెట్లు పెంచాల్సి ఉంటుంది. అదే గాలి వీచే దిశలలో అయితే తమ శక్తిలో సగం శక్తిని కేటాయిస్తే సరిపోతుంది. మహారాష్ట్రలోని విధర్భలో తిష్టవేసిన మిడతలు రూటును గాలి వీచే దిశవైపు మళ్లించాయి.. గాలి ఉత్తరం వైపు వీయడంతో మధ్యప్రదేశ్ వైపుకు వెళ్లాయి. అదే దక్షిణం వైపు వీస్తే తెలంగాణాలోకి వచ్చి ఉండేవి.ఇప్పుడు మధ్యప్రదేశ్ నుండి చత్తీస్ ఘఢ్ వైపు పయనించాయి.
మిడతలు రూటు మార్చుకోవడం రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది. లేదంటే ఒక్క మిడతల దండు 35వేల మందికి సరిపడా ఆహారాన్ని నిమిషాల్లో స్వాహా చేస్తుంది.. మిడతల దండు అంటే సుమారు వాటిల్లో కోటివరకు మిడతలు ఉంటాయి.. పంటకి ఏదైనా చీడపీడ వస్తుందంటే ఏదన్నా నివారణ ఆలోచించవచ్చు కానీ, మిడతల దండు దాడి చేస్తే ఆలోచించుకునే టైం కూడా ఉండదు..వీటి దాడికి కరువు బారిన పడిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
మిడతలు మళ్లీ మన రాష్ట్రం వైపు వస్తాయా అనేది అనేకమంది ప్రశ్న..చెప్పలేము. ఎందుకంటే మిడతలు రోజుకి 100 నుండి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయగలవు.అవి ఎప్పుడు వాటి రూటుని ఎలా మారుస్తాయనేది చెప్పలేము.. మిడతల దాడిని ఎదుర్కోవడానికి అధికారులు సరిహద్దుల్లో రసాయానాలు, అగ్నిమాపక యంత్రాలు ఇతరత్రా ముందస్తు జాగ్రత్తల ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు..ఒకవేళ మిడతలు దాడి చేస్తే సహజ పద్దతిలో వాటి నుండి పంటను రక్షించుకోవడానికి ఏం చేయాలో కింది లింక్ ఓపెన్ చేసి చదవండి.
End of Article