Ads
ఆదివారం సాయంత్రం ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జ కు గుండెపోటు వచ్చింది.అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకపోయింది.ఆసుపత్రి కి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందారు చిరంజీవి సర్జ.అయితే ప్రముఖ రచయిత్రి శోభాడే పొరపాటున టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చనిపోయారు అని చిరంజీవి ఫోటో అప్లోడ్ చేసి అయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని రాసారు.కాగా శోభాడే ట్వీట్ కొద్ది నిమిషాలలోనే వైరల్ అయింది.అయితే దీనిపై మెగా అభిమానులు మండిపడుతున్నారు.వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
కన్నడ చిత్రసీమ లో ఎంతో మంది అభిమానుల మన్ననలు అందుకున్న నటుడు చిరంజీవి సర్జ.అయితే ఈయన మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమ అంతా విషాదంలో మునిగిపోయింది.అయితే శోభాడే పొరపాటున మెగాస్టార్ చనిపోయారు అంటూ ట్వీట్ చెయ్యడంతో మెగా అభిమానులు ఆవేదనతో పటు తీవ్ర ఆగ్రహానికి కూడా గురయ్యారు.విషయం తెలుసుకోకుండా ఇలా తప్పుగా ట్వీట్ చేసారంటే శోభాడే ఎంత తెలివి తక్కువ వ్యక్త్తో అర్ధం చేసుకోవచ్చు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేసారు.
మద్యం తాగి ఇలా తప్పుడు ట్వీట్ లు చెయ్యడం సరి కాదు అని ఒకరు,మద్యం మోతాదు మించడం వలన ఇలా ట్వీట్ చేసారని మరొకరు మండిపడుతున్నారు.శోభాడే ఇంత స్టుపిడ్ అనుకోలేదని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కాగా రకరకాల ట్రోల్ల్స్ తో శోభాడే పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు మెగా అభిమానులు.అయితే తాను తప్పుగా ట్వీట్ చేసారని తెలుసుకున్న శోభాడే ఆ ట్వీట్ ను డిలీట్ చేసారు.
End of Article