Ads
కరోనా కారణంగా ఇంట్లో నుండి ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఒక కాలేజీ యాజమాన్యం ఆన్లైన్లో ఈ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సెర్మనీ నిర్వహించింది. ఈ కార్యక్రమం యూట్యూబ్ లో “డియర్ క్లాస్ ఆఫ్ 2020” పేరుతో ఆదివారం (జూన్ 7) ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి సుందర్ పిచాయ్ అతిథిగా ఆన్లైన్ లోనే హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి సుందర్ పిచాయ్ ఇలా మాట్లాడారు.
Video Advertisement
ఈ టెక్నాలజీ లో మీకు కోపం, అసహనం తెప్పించే ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని అలాగే ఉండనివ్వండి. ఆ కోపం నుండే. ఏదన్నా చేయాలి అన్న పట్టుదల పెరుగుతుంది. అందులోనే మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కలలో కూడా ఊహించని స్థాయిలో ఈ జనరేషన్ ముందుకెళ్లడానికి ఒక దారి ఏర్పడుతుంది. మీ కోపం అలానే ఉండనివ్వండి. అదే ప్రపంచానికి కావాల్సిన మార్పును సృష్టిస్తుంది.
తాను 27 ఏళ్ళ క్రితం, భారతదేశం వదిలేసి పై చదువుల కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతూ ” మా నాన్న తన ఏడాది జీతం మొత్తం పెట్టి నా ఫ్లైట్ టికెట్ కొన్నారు. నేను ఫ్లైట్ ఎక్కడం అదే మొదటిసారి. నేను క్యాలిఫోర్నియా వచ్చినప్పుడు ఇక్కడ ఏవి నేను అనుకున్నట్టు లేవు. అమెరికా చాలా ఖరీదైన దేశం. చిన్న వస్తువు కొనాలన్నా కూడా ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
భారతదేశం కి ఒక్క ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే ఫోన్ కాల్ ధర నిమిషానికి రెండు డాలర్లు ఖర్చు అవుతుంది. ఒక బ్యాగ్ కొనాలి అంటే దాదాపు మా నాన్న నెల జీతం అంత అవుతుంది. ఇప్పుడు క్యాలిఫోర్నియా ని అప్పుడు కాలిఫోర్నియా తో పోల్చిచూస్తే అసలు ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. అదృష్టంతో పాటు టెక్నాలజీ పట్ల ఆసక్తి, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఆలోచన ఉండటంతో నేను ఇంత దూరం రాగలిగాను “ అని అన్నారు.
ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మరియు మాజీ ప్రథమ మహిళా ప్రధాని మిచెల్ ఒబామా, గాయని లేడీ గాగా, మరియు విద్యా కార్యకర్త మరియు నోబెల్ గ్రహీత మలాలా యుసాఫ్జాయి కూడా పాల్గొన్నారు.
End of Article