కడుపుతో ఉన్న కూతురుని తల్లితండ్రులే దిండుతో నొక్కి చంపేశారు..పరువు పోతుందనే?

కడుపుతో ఉన్న కూతురుని తల్లితండ్రులే దిండుతో నొక్కి చంపేశారు..పరువు పోతుందనే?

by Megha Varna

Ads

ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చేవారిని లేదా ప్రాణాలు తీసేవారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.అయితే పరువు కోసం ప్రాణాలు తీసే తల్లితండ్రులను ఈ కాలంలో చాలా అరుదుగా చూస్తుంటాం.కాగా గద్వాల్ జిల్లా లోని జోగులాంబ ప్రాంతాల్లో కన్న తల్లితండ్రులే పరువు పోతుంది అని కుమార్తె ను చంపేశారు.వివరాల్లోకి వెళ్తే….

Video Advertisement

గద్వాల్ జిల్లా లోని జోగులాంబ ప్రాంతంలో భాస్కర్ రెడ్డి,వీరమ్మ దంపతులు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నారు.అయితే వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా వీరికి ఆఖరి కుమార్తె అయిన 20 యేళ్ళ దివ్య కర్నూల్ జిల్లా లోని ఓ కాలేజీ లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది.అయితే కరోనా వైరస్ కారణంగా విద్య సంస్థలు అన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే దీంతో దివ్య ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉంది.అయితే గత రెండు నెలల నుండి దివ్య కు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకునివెళ్ళి పరీక్షలు చేయించారు.

 

representative image

కాగా దివ్య గర్భవతి అని డాక్టర్ లు నిర్దారించారు.అయితే గత కొద్ది కాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని దివ్య కుటుంబ సభ్యులతో చెప్పింది.దీంతో దివ్య ను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులు విన్నవించుకున్నారు.అయితే అబార్షన్ చేయించుకోవడనికి నిరాకరించింది దివ్య.అయితే ఈ విషయం బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని భయపడ్డ తల్లితండ్రులు నిద్రిస్తున్న దివ్య ను దిండు తో నోరు నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.


End of Article

You may also like