ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఉండి.. తర్వాత బాలివుడ్ యాక్ట్రెస్ గా మారిన సన్నిలియోన్ తను చేసిన పనులు, చేస్తున్న సామాజిక సేవల ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకుంది.. పోర్న్ స్టార్ అంటేనే అదో రకంగా చూసే మన దేశంలో సన్నిలియోన్ తర్వాత ఆ ఆలోచన మారిపోయింది..సరే ఇప్పుడు చెప్పుకోబోయేది మరో విషయం..ఒకప్పుడు ఛాంపియన్ గా నిలిచిన కార్ రేసర్ ప్రస్తుతం పోర్న్ స్టార్ గా మారింది..తనే రెనీ గ్రేసి..
ఆస్ట్రేలియాకు చెందిన రెనీ గ్రేసీ వయసు 25ఏళ్లు..చిన్న వయసులోనే కార్ రేసింగ్ లో రికార్డులు సృష్టించి చాంపియన్ గా నిలించింది..పేరు, డబ్బు,సౌకర్యాలు.. దాంతో గ్రేసీ జీవితం మారిపోయింది..కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దాన్ని జీవితం అని ఎందుకంటారు.. ఛాంపియన్ స్థానం ఎంతో కాలం నిలబడలేదు..రేసింగ్ లో వెనకబడింది..ఆర్ధికంగా కూడా వెనకబడింది..కూడబెట్టుకున్న డబ్బు మొత్తం ఖర్చైపోయింది..బతకడానికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి కూడా ఎదురయింది.
అలాంటి టైంలో పూటగడవడానికి కారు యార్డులో కూడా పనిచేసింది..కానీ ఆ డబ్బులు సరిపోలేదు..తను అంతకన్నా ఎక్కువ సంపాదించాలి..సంపాదించగలను అనుకుంది..కానీ ఏం చేస్తే అంత డబ్బు వస్తుంది..ఒకరోజు ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్‌సైట్‌ను చూసి డబ్బులు సంపాదించడానికి పోర్న్‌స్టార్ గా మారడమే మార్గం అనుకుంది..అంతే న్యూడ్ ఫొటోలు,వీడియోలు తీసి ఆ సైట్లో అప్లోడ్ చేసింది..వారం రోజుల్లో రెండున్నర లక్షల సంపాదన తన ఖాతాలో జమయింది.
ఒకప్పటి ఛాంపియన్ ఇప్పుడు పోర్న్ స్టార్ గా దిగజారిపోయిందా అని అనుకుంటే మనం పొరబడ్డట్టే..ఎందుకంటే తను చేసింది తప్పని తాను భావించదు..తన జీవితంలో తాను తీసుకున్న సరైన నిర్ణయం ఇదే అని చెప్తోంది గ్రేసి..ఈ రంగంలోకి బాగా ఆలోచించే వచ్చాను,నా బతుకు దెరువుకోసం ఈ రంగంలోకి అడుగుపెట్టాను..ఇది చెడ్డపనిగా నేనేం భావించట్లేదు..నేను చెడ్డదాన్నని అసలు అనుకోవట్లేదు..నన్ను ఎవరు ఎలా పిలిచినా, నా గురించి ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు.. అంటూ చెప్పుకొిచ్చింది.