Ads
“న్యూజిలాండ్” ని కరోనా ఫ్రీ దేశంగా మార్చిన ఆ దేశ ప్రధాని జెసిండా ..ఇప్పటికే ప్రపంచ నలుమూలల నుండి జెసిండా ని ప్రశంసల్లో ముంచుతున్నారు..తాజాగా జెసిండా మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు..ఇక నుండి పాఠశాల స్థాయి విద్యార్ధినులకు శానిటరి ప్యాడ్స్ అందించాలని నిర్ణయించారు జెసిండా.. న్యూజిలాండ్ ను నెలసరి పేదరికం లేని దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు జెసిండా.
Video Advertisement
Also read: పాజిటివ్ కేసులు “జీరో”…కానీ “న్యూజిలాండ్” ని కరోనా ఫ్రీ అనడానికి కండిషన్ ఏంటంటే?
కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలు నెలసరి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ప్యాడ్స్ ని కొనుక్కోనేంత ఆర్ధిక స్థోమత లేని వారు అనేకమంది.. ఈ సమస్య మూలంగా విద్యకు దూరం అవుతున్న అమ్మాయిలెంతో మంది..అటువంటి వారందరి సమస్యను అర్దం చేసుకున్న జెసిండా, ఆడపిల్లల్ని విద్యకు దూరం చేయకూడదనే ఆలోచనతో వారికి ప్యాడ్స్ ఉచితంగా అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
Also read: న్యూజిలాండ్ లో కరోనా కట్టడికి కారణం ఆ అమ్మ మనసే…! ఏం చేసారంటే..?
తొలుత 15 పాఠశాలల్లో విద్యార్ధినులకు శానిటరి న్యాప్కిన్స్ అందిస్తామని..వచ్చే ఏడాదికి పూర్తిగా అన్ని పాఠశాలల్లో విద్యార్ధినులకు శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉండేలా చూస్తాం అన్నారు జెసిండా.. 9-18 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఏడాదికి 95 వేల మంది నెలసరి సమయంలో స్కూల్ మానేసి ఇంట్లోనే ఉండిపోతున్నారని..ఇకపై ఇక్కడ విద్యార్ధినులకు ఆ సమస్య ఉండదని..ఫాఠశాల విద్యార్ధినులందరికి ఇకపై ప్యాడ్స్, ట్యాంపూన్స్,ఇతర శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చారు జెసిండా.
ఇదిలా ఉండగా నెలసరి పేదరికం అనే సమస్య అన్ని దేశాల్లో ఉన్నదే..మన దేశంలో కూడా ఇప్పటికి అనేకమంది ప్యాడ్స్ స్థానంలో పాత బట్టలని వినియోగిస్తుంటారు.. దీని మూలంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.. తమిళనాడుకి చెందిన అరుణాచలం మురుగనాదం, PURE వంటి కొన్ని స్వచ్చంద సంస్థలు ఉచితంగా ప్యాడ్స్ అందిస్తూ తమ వంతు సాయం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా శానిటరి ప్యాడ్స్ అందించాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది..కరోనా కాలంలో ప్రభుత్వాలు ప్రతి నెలా రేషన్ వస్తువులతో ప్యాడ్స్ అందించాలని కోరారు..ఎంత వరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి..
End of Article