ప్రాణస్నేహితుడితో చిరంజీవి సర్జా చివరి వాట్సాప్ చాట్…ఆఖరి కోరిక తీరకుండానే.!

ప్రాణస్నేహితుడితో చిరంజీవి సర్జా చివరి వాట్సాప్ చాట్…ఆఖరి కోరిక తీరకుండానే.!

by Sainath Gopi

Ads

యాక్షన్ కింగ్ అర్జున్ బంధువు..కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతితో కన్నడ ఇండస్ట్రీలో విషాద చాయలు అలముకున్నాయి..అతి చిన్న వయసులో చిరంజీవి సర్జా హఠాత్తుగా మరణించడంతో అందరూ షాక్ కి గురయ్యారు..అర్జున్  బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి అతి తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.తాను చనిపోయేముందు తన బెస్ట్ ఫ్రెండ్ ప్రజ్వల దేవరాజ్ తో చేసిన చివరి చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ చాట్ లో ఏముందో చూస్తే కన్నీళ్లొస్తాయి.

Video Advertisement

“I Love You Guys . మనందరం కలిసి వారం రోజులు ట్రావెల్ చేద్దాం. ప్రశాంతత కోసం అందరం కలుద్దాం. మనందరం కలవడం కంటే విలువైంది ఇంకేం ఉంటుంది? రేపు ఏం జరుగుతుందో చెప్పలేం” అంటూ చిరంజీవి సర్జా మెసేజ్ చేసారు. అంతలోనే తన కోరిక తీరకుండా చిరంజీవి సర్జా మమల్ని వీడి పోయారని ప్రజ్వల్ బాధపడ్డారు.

 

ప్రస్తుతం అందరూ చిరంజీవి భార్య మేఘన గురించే బాధపడుతున్నారు.చిరంజీవి , మేఘనల బంధం వయసు పదేళ్లు.. పదేళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు..తర్వాత ప్రేమికులుగా మారి  రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు..మన తెలుగు నటులు సమంతా,చైతూ మాదిరిగానే వీరి వివాహం కూడా క్రిస్టియన్, హిందూ పద్దతిలో గ్రాండ్ గా జరిగింది..ప్రస్తుతం మేఘన గర్బవతి..పుట్టబోయే బిడ్డ కోసం చిరంజీవి ఎన్నో కలలు కన్నారని అవి తీరకుండానే అందరిని విడిచివెళ్లిపోయారని సన్నిహితులు చెప్తుండగా..అందరి బాధ మేఘన గురించే ..ప్రేమించి పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే భర్త దూరం అవ్వడం అందరిని కలచివేస్తుంది.

చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ కూడా హీరోయిన్ నే..మళయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మేఘన నటిగా పరిచయం అయింది తెలుగు ఇండస్ట్రీ ద్వారానే..అల్లరి నరేష్, కామ్నా జెఠ్మలాని జంటగా వచ్చిన బెండప్పారావ్ ఆర్ఎంపీ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించారు మేఘన.

రీమేక్ కింగ్ గా పేరు పొందిన చిరంజీవి సర్జా 11ఏళ్ల కెరీర్లో   మొత్తం ఇరవైకి పైగా సినిమాల్లో నటించారు..వాటిల్లో అత్యధిక శాతం  14 సినిమాలు రీమేక్ చిత్రాలే ..ఇతర ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను కన్నడలో రీమేక్ చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.తొలిచిత్రం “వాయుపుత్ర”తోనే “ఇన్నోవేటివ్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ యాక్టర్” అవార్డ్ అందుకున్నరు..ఈ చిత్రానికి దర్శకుడు అర్జున్ సర్జా సోదరుడు కిషోర్ సర్జా. విజిల్, చంద్రలేఖ, అమ్మా ఐ లవ్ యూ చిరంజీవి నటించిన చిత్రాల్లో కొన్ని.


End of Article

You may also like