రూ.300 ల స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే…19000 ఇయర్ ఫోన్స్ వచ్చాయి.! చివరికి ట్విస్ట్ ఏంటంటే?

రూ.300 ల స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే…19000 ఇయర్ ఫోన్స్ వచ్చాయి.! చివరికి ట్విస్ట్ ఏంటంటే?

by Mohana Priya

Ads

అదృష్టమనేది మనిషికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కొంతమందికి అది ఊహించనంత డబ్బు రూపంలో రావచ్చు. కొంతమందికి మనుషుల రూపంలో రావచ్చు. ఇంకొంతమందికి వస్తువుల రూపంలో రావచ్చు. ఈ వస్తువు రూపంలో అదృష్టం రావడం ఏంటి అనుకుంటున్నారా ? ఇలా కూడా అదృష్టం వరించే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్యనే అమెజాన్ రుజువు చేసింది. ఇలా క్లుప్తంగా చెప్తే అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టమే. అసలేం జరిగింది అనేది కొంచెం వివరంగా చూద్దాం.

Video Advertisement

గౌతం అన్న వ్యక్తి ఇటీవల అమెజాన్లో ఒక బాడీ లోషన్ ఆర్డర్ చేశారు. దాని ఖరీదు 300 రూపాయలు. అమెజాన్ వాళ్లు బాడీ లోషన్ కి బదులు హెడ్ ఫోన్స్ పంపారు. ఆ హెడ్ ఫోన్స్ ఖరీదు ఏ వెయ్యి రూపాయలో రెండు వేల రూపాయలో ఉంటుంది దాంట్లో అంత షాక్ అవ్వాల్సిన విషయం ఏం ఉంది ? అని మీరు అనుకుంటే మాత్రం తప్పే. అంతలా షాక్ అయ్యారు అంటే దాని ధర కూడా అంత షాకింగ్ గానే ఉంది. ఆ హెడ్ ఫోన్స్ ధర 19000. 300 ఎక్కడ ?19,000 ఎక్కడ ?

విన్న మనకే ఇలా అనిపిస్తుంటే ఇంక ఆర్డర్ చూసిన తర్వాత గౌతమ్ పరిస్థితి ఏమై ఉంటుంది? ఇందాక మనం అనుకున్నట్టుగానే వెయ్యి రెండు వేలు అంటే ఏమో అనుకునేవాడు. కానీ 19000 అనేసరికి అతనికి అంత మంచి హెడ్ ఫోన్స్ వచ్చినందుకు ఆనందపడాలో లేదా ఒకటి అడిగితే మరొకటి పంపిన అమెజాన్ వారి నిర్లక్ష్యాన్ని చూసి షాక్ అవ్వాలో అర్థం కాలేదు. మనకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా లేదా ఇంకేం చెప్పాలనుకున్నా మన స్నేహితులు ఇంట్లో వాళ్లతో పాటు సమానంగా ఫీలింగ్స్ ని పంచుకునే ఒకే ఒక్క మాధ్యమం సోషల్ మీడియా.

గౌతమ్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో (ట్విట్టర్ లో) పెట్టాడు. ట్విట్టర్లో ఏ చిన్న విషయమైనా నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. ఈ విషయం కూడా అలా పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. దాంతో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న కొంతమంది అమెజాన్ కస్టమర్స్ తాము కూడా  ఇలాంటి వాటికి బాధితులే అని తమకు ఏం జరిగిందో పోస్ట్ అని చేశారు. వాళ్లలో ఒకళ్ళకి 13000 వేల రూపాయల మోనిటర్ ఆర్డర్ చేస్తే కోలిన్ బాటిల్స్ ని పంపించారట. ఇంకొకళ్ళు ఆఫ్టర్ షేవ్ లిక్విడ్ ఆర్డర్ చేస్తే ఏకంగా లెనోవో ట్యాబ్ పంపించారట.

ఇంకొక విషయం ఏంటంటే ఈ వస్తువులన్నీ అమెజాన్ నాన్ రిటర్నబుల్ పాలసీ కిందకు వస్తాయి. అంటే ఒక్కసారి వస్తువును తీసుకుంటే తిరిగి ఇచ్చే వీలు ఉండదు. కాబట్టి ఎవరి వస్తువులను వాళ్ళే ఉంచుకోవాలి. అందరూ గౌతమ్ పరిస్థితి చూసి అదృష్టవంతుడు అని అంటూనే అసలు ఆ హెడ్ ఫోన్స్ చేసిన అతని పరిస్థితి ఏమిటి అని ఆలోచించారు. గౌతం వేసిన ట్వీట్ చూసి ఒక వ్యక్తి తను హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేశాడు అని కానీ అతనికి బాడీ లోషన్ వచ్చింది అని కావాలంటే వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పాడు.

ఏదేమైనా ఇలాంటి సంఘటనలు ఎదురైతే కష్టమే. గౌతమ్ కి అవతల హెడ్ ఫోన్స్ కొన్న వ్యక్తి రెస్పాండ్ అయినట్టు అందరికీ అవ్వాలి అని లేదు. 13000 వేల రూపాయల వస్తువు ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ గ్లాసులు అద్దాలు తుడిచే లిక్విడ్ తో తారుమారు అవుతే అది ఖచ్చితంగా నష్టమే కదా. ఇలాంటి తప్పుల వల్ల బాధపడేది అమెజాన్ కాదు డీలర్లు కస్టమర్లు. ఇప్పటికైనా అమెజాన్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగినా ఆ వస్తువు తనది కాదు కాబట్టి కచ్చితంగా ఆ వ్యక్తి ఇలాగే ఏదో ఒక మాధ్యమం ద్వారా అవతల వ్యక్తికి వాళ్ల వస్తువు తిరిగి ఇచ్చేసి తమ వస్తువు తాము తీసుకోవాలి.


End of Article

You may also like