ముద్దు పెడితే కరోనా పోతుందన్నాడు ఆ బాబా…చివరికి జరిగిన ట్విస్ట్ ఏంటంటే?

ముద్దు పెడితే కరోనా పోతుందన్నాడు ఆ బాబా…చివరికి జరిగిన ట్విస్ట్ ఏంటంటే?

by Megha Varna

Ads

కరోనా కారణంగా అన్ని దేశాలు తీవ్ర విపత్తును ఎదుర్కొంటున్నాయి.కరోనా రాకుండా ఉండడానికి వాక్సిన్ ఇంకా ఎవరూ కొనగొనలేదు.దీంతో సామజిక దూరం పాటించడం ఒక్కటే మార్గం అని తెలిసి ప్రబుత్వాలన్నీ ఇదే పద్దతిని అనుసరిస్తుంటే ఒక బాబా మాత్రం నేను ముద్దు పెడితే కరోనా కు వాక్సిన్ వేసినట్లే నేను ముద్దు పెడితే కరోనా మీ చెంతకు రాదు అని ప్రచారం చేసి చాలామందికి ముద్దులు పెట్టేసాడు.కాగా ఆ బాబా కరోనా భారిన పడి మృతి చెందాడు..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

source: twitter/sabanaqvi

మధ్యప్రదేశ్ లోని నయపూర జిల్లాలోని రాతలంలో ఓ బాబా నేను ముద్దు పెడితే కరోనా మీ చెంతకు చేరదు అని చెప్పి తన దగ్గరకి వచ్చిన వాళ్లందరికీ ముద్దులు పెట్టేసాడు.అయితే ఆ బాబా కరోనా తో మృతి చెందడంతో అధికారులు ఆ బాబా తో ముద్దు పెట్టుకున్నవారికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు .

అయితే ఆ బాబాతో ముద్దు పెట్టించుకున్నవాళ్లలో 16 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా 25 మందిని క్వారంటైన్ సెంటర్స్ కు తరలించారు.అయితే సామాజిక దూరం పాటించండి అని ప్రభుత్వాలు ఇంతలా చెప్తున్నా ఇలాంటి మూఢనమ్మకాల భారిన ప్రజలు ఎందుకు పడుతున్నారో అర్ధంకావట్లేదు అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like