అది దయ్యం పనే అంటూ వీడియో వైరల్…అసలు కథ బయటపెట్టిన పోలీసులు!

అది దయ్యం పనే అంటూ వీడియో వైరల్…అసలు కథ బయటపెట్టిన పోలీసులు!

by Megha Varna

Ads

ఈమధ్యకాలంలో ఏ చిన్న విషయం జరిగిన సోషల్ మీడియా అంతా వైరల్ గా మారి అంతటా ఆ విషయం గురించి చర్చలు మొదలవుతున్నాయి.అయితే కొంతమంది ఆకతాయిలు కావాలనే తప్పు ప్రచారాలు చేస్తుంటారు కాగా ఆ విషయాలు కూడా వైరల్ గా మారుతుంటాయి.అయితే ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో దెయ్యాలు వ్యాయామం చేస్తున్నాయనే వార్త విస్తృతంగా ప్రచారం అయింది.. వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో కాలిగా ఉన్న ప్రదేశములో రాత్రి పూట ఓ వ్యాయామం చేసే పరికరం ఎవరూ లేకుండా కదలడాన్నిఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేసారు.కాగా ఛాతి పెరగడానికి ఉపయోగించే వ్యాయమ పరికరం అది.ఎవరూ లేకుండా వ్యాయమ పరికరం కదులుతుండడంతో ఆ వీడియో చుసిన కొంతమంది నిజంగానే దెయ్యం వ్యాయామం చేస్తుందని భయాందోళనలకు లోనయ్యారు.

అయితే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యాయమ పరికరాన్ని పరీక్షించి చూడగా ఎవరో కొంతమంది వ్యక్తులు కావాలనే ఆ పరికరంలో ఎక్కువ గ్రీజ్ రాసి ఒకసారి ఆ పరికరాన్ని కదిలించి వెళ్ళిపోయి వీడియో తీసారని తెలుసుకున్నారు.ఎక్కువ గ్రీజ్ రాయడం వలన ఆ పరికరం కదులుతూ ఉంది అని అది దెయ్యం కాదని పోలీసులు స్పష్టం చేసారు.కాగా ఈ వీడియో తీసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్థానిక సిఐ అన్నారు.


End of Article

You may also like