Ads
వన్ డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ తో పటు టి 20 వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ ని భారత్ కు తీసుకువచ్చిన ఘనత మాత్రం మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతుంది.ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో అయినా జట్టును కూల్ గా ముందుకు నడిపించగలడు అని ధోని కి మిస్టర్ కూల్ అనే పేరు కూడా వచ్చింది.అయితే మాజీ టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన గౌతమ్ గంబీర్ తాజగా ధోనీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
సౌరవ్ గంగూలీ భారత్ జట్టు కు నేతృత్వం వహిస్తున్న సమయంలో 2004 లో టీం ఇండియా జట్టులోకి వచ్చారు మహేంద్ర సింగ్ ధోని.అయితే ధోని కెరీర్ మొదట్లోనే పాకిస్తాన్ మీద విజృంభించి వరస సెంచరీలు బాదడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే కెరీర్ ఆరంభంలో మూడవ స్థానంలో బాటింగ్ చేసి పలు విద్వాంసాకార ఇన్నింగ్స్ ఆడి భారీ పరుగులు నమోదు చేసుకున్నారు మహీంద్రా సింగ్ ధోని.
అయితే 2007 నుంచి భారత్ కెప్టెన్ గా ఎంపికైనప్పటి నుండి మిడిల్ ఆర్డర్ లో కొనసాగుతూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చారు ధోని.ధోని కెప్టెన్ కాకపోయి ఉండీ మూడవ స్థానంలోనే బాటింగ్ కొనసాగించినట్లైతే ప్రపంచం మరో గొప్ప బ్యాట్స్ మాన్ ను చూసి ఉండేదని గౌతమ్ గంబీర్ అభిప్రాయపడ్డారు.క్రికెట్ కనెక్టెడ్ అనే ఒక ప్రోగ్రాంకు ఇంటర్వ్యూ ఇచ్చిన గౌతమ్ గంబీర్ ధోని పై ఈ వ్యాఖ్యలు చేసారు.
End of Article