Ads
ప్రమాదం చెప్పకుండా ఏ రూపంలో అయినా వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఓ మహిళ అద్దం లేదు అని అనుకోని వేగంగా బ్యాంకు లోపాలకి వెళ్ళింది.కానీ అక్కడ అద్దం ఉండడంతో ఓ మహిళ కు అద్దం ముక్కు మీద మరియు కడుపులో గుచ్చుకుంది.దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.కాగా ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Video Advertisement
ఎర్నాకులానికి చెందిన బీనా పాల్ అనే 40 యేళ్ళ మహిళ పెరంబపూర్ లో ఓ బ్యాంకు కు వెళ్లారు.కాగా ఆ సమయంలో కార్ లో ఏదో వస్తువు మర్చిపోయినట్లుగా బీనా పాల్ కు గుర్తొచ్చి వెంటనే బ్యాంకు లోపల నుండి కార్ దగ్గరకి వేగంగా పరిగెత్తారు.అయితే మధ్యలో గాజు అద్దం ఉంది. కానీ ఆ అద్దం లేదు అని భావించిన బీనా పాల్ అద్దాన్ని గుద్దుకొని పడిపోయారు.
దీంతో గాజు ముక్కలు బీనా పాల్ ముక్కుమీద మరియు కడుపులో గుచ్చుకున్నాయి.కాగా వెంటనే బ్యాంకు లో పక్కన ఉన్నవాళ్లు బీనా పాల్ ను పైకి లేపి గుడ్డ కట్టి ఆసుపత్రికి తరలించారు.కానీ కడుపులో తీవ్ర రక్తస్రావం కావడంతో బీనా పాల్ మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు.కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ముమ్మరం చేసారు.
End of Article