Ads
ఇటీవల సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకుని మరణించారనే విషయం తెలిసిందే .అయితే సుశాంత్ మరణంపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు.కాగా సుశాంత్ సింగ్ రాజపుట్ మరణించిన కారణంగా సంజన ఒక టీవీ ఛానల్ లో లైవ్ లోకి వచ్చారు . ఆ సమయంలో ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంపై స్పందిస్తున్న సమయంలో లైవ్ లో మేకప్ సరిచేసుకున్నారు.ఆ వీడియోలో సంజన మేకప్ చేసుకుంటుంది అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.అయితే ఆ విషయంపై సంజన వివరణ ఇచ్చారు.
Video Advertisement
ఇతరుల లాగే లైవ్ లో ఉన్నప్పుడు కనీసం చూడతగ్గట్టు అయినా కనిపించాలి అనుకున్నాను. ఇందులో తప్పు లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ మానిప్యులేటెడ్ వివాదం నుండి నన్ను మినహాయించాలని నేను ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తాను, ఇది చాలా సున్నితమైన సమస్య మరియు ప్రస్తుత సమయం చాలా క్లిష్టమైనది- నాపై వస్తున్నా ట్రోల్ల్స్, వేధింపులు చూస్తే షాక్ అవుతారు.
మేము పబ్లిక్ ఫిగర్ కాబట్టి మేము పొరపాటు చేయకపోయినా క్షమాపణ చెప్పాలి. వీడియో లైవ్ గురించి నాకు ముందుగా తెలీదు. ప్రసారం అవుతున్నట్టు సమాచారం అందలేదు. టెక్నికల్ ఇష్యూ జరిగి ఉండచ్చు. ప్రతి ఒక్కరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని మరియు సున్నితంగా ఉండాలని అభ్యర్థించండి, మనమందరం సమాన నష్టాన్ని అనుభవిస్తున్నాము. ట్రోల్ల్స్ ని నేను ప్రోత్సహించాలి అనుకోవట్లేదు. నా పరిస్థితిని అర్ధం చేసుకొని చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు.
తన కుటుంబానికి ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తూ సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని RIP #SSR. ధన్యవాదాలు – సంజన
End of Article