Ads
సుశాంత్ రాజపుట్ మరణం సినీ ప్రపంచమంతటా చర్చనీయాంశం అయింది.దీంతో బాలీవుడ్ మంచి ఇండస్ట్రీ కాదు అని టాలెంట్ ఉన్నవాళ్ళని పైకి రానివ్వరని కొన్ని అభిప్రాయాలూ వ్యక్తం కావడంతో పలు బాలీవుడ్ ప్రముఖులు కూడా బాలీవుడ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.ఇప్పటికే వివేక్ ఒబెరాయ్,కంగనా లాంటి నటులు బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఉసెరవెల్లి చిత్రంలో నటించిన పాయల్ ఘోష్ సుశాంత్ మరణంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు..ఆ వివరాల్లోకి వెళ్తే …..
Video Advertisement
డిప్రెషన్ కు లోనయ్యి సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ కలిగించింది అని పాయల్ ఘోష్ అన్నారు.పాయల్ ఘోష్ సుశాంత్ మరణంపై స్పందిస్తూ …నేను కూడా ఒకప్పుడు డిప్రెషన్ తో చాలా బాధపడ్డాను.కానీ ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు ,స్నేహితులు నాకు తోడుగా ఉండడం వలన డిప్రెషన్ నుండి బయటకి రాగలిగాను అని అన్నారు పాయల్ ఘోష్.కాగా సుశాంత్ మరణంపై కొన్ని సంచలన ట్వీట్స్ చేసారు పాయల్ ఘోష్.
దక్షిణాది సినిమా ఇండస్ట్రీ స్వర్గం ,బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ నరకం దక్షణాది నుండి బాలీవుడ్ కి వెళ్లి తప్పు చేసానని ట్వీట్ చేసారు పాయల్ ఘోష్. సుశాంత్ నిన్ను కాపాడుకోవడంలో మేము విఫలం అయ్యాము మమ్మల్ని క్షమించు అని మరో ట్వీట్ చేసారు.అయినా దక్షణాది వారు హీరోయిన్స్ కోసం గుళ్లు కూడా కడతారని కానీ బాలీవుడ్ వారు మాత్రం హీరోయిన్స్ ను అగౌరపరిచేలా మాట్లాడతారని పాయల్ ఘోష్ ఇంకో ట్వీట్ ద్వారా తెలిపారు.
End of Article