Ads
కొన్నిరోజుల క్రితం భారత్ ,చైనా సరిహద్దు ప్రాంతం లడఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్ ,చైనా మధ్య ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే.అయితే ఈ దాడి గురించి భిన్న కధనాలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఆ యుద్ధంలో పాల్గొన రాజస్థాన్ కు చెందిన సురేంద్ర సింగ్ గాల్వాన్ యుద్ధ సమయంలో ఏమి జరిగిందో అనే విషయాన్నీ ఓ మీడియా ఛానల్ తో పంచుకున్నారు.ఆ వివరాల్లోకి వెళ్తే …
Video Advertisement
సురేంద్ర సింగ్ కధనం ప్రకారం …కేవలం ఒకే ఒక్క మనిషి సరిపోయేంత ప్రదేశంలో ఈ యుద్ధం జరిగింది.చైనా సైనికులు హఠాత్తుగా దాడికి పాల్పడ్డారు.అప్పుడు వాతావరణమంతా కూడా విపరీతమైన చలితో కూడుకుని ఉంది.అయితే ఆ సమయంలో యుద్దమంత కూడా ఓ నదిలో జరిగింది.భారత సైనికులు దాదాపు 200 మంది ఉంటె చైనా సైనికులు 1000 మంది ఉన్నారు.
మేము తక్కువ మందే ఉన్న ఎంతో కష్టపడి చైనా సైనికుల మీద పోరాటం చేసాం.కానీ ఆ పోరాటంలో మేము చాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం.భారత్ సైనిక బలగం ఎందులోనూ తక్కువ కాదు అనే విషయం అందరికి తెలిసిందే.కాకపోతే చైనా వారు మోసపూరితంగా దాడికి దిగడం వలన గాల్వాన్ భారత్ సైనికులు దెబ్బతినాల్సి వచ్చింది అని సురేంద్ర సింగ్ అన్నారు.
End of Article